Breaking News

నగరాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పునరంకితం కావాలి ..

-కె.దినేష్ కుమార్, కమిషనరు
-ఎమ్. షర్మిలా రెడ్డి, రుడా చైర్ పర్సన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాభివృద్ధిలోను, సంక్షేమ పధకాలు అమలు చేయుటలోను అధికారులు, సిబ్బంది అందరూ భాగస్వామ్యులు కావాలని దినేష్ కుమార్ అన్నారు.మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని నెలకొల్పిన మహాత్మగాంధి విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పుష్పమాలంకృతులను చేసిన రుడా చైర్ పర్సన్  ఎం.షర్మిలారెడ్డి తో కలిసి జెండా వందన కార్యక్రమము నిర్వహించారు.ఈ సందర్భముగా రుడా ఛైర్ పర్సన్  ఎం.షర్మిలారెడ్డి మాట్లాడుతూ అనేకమంది త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని సక్రమంగా వినియోగించు కోవాలన్నారు. నగరాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కు అందరూ తోడ్పాటు అందించాలని అన్నారు.కమిషనరు కె.దినేష్ కుమార్ సిబ్బందికి, నగర ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి, స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుండి అభివృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానం సాధించుకున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందటానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి పెద్ద పీట వేయాలని, సంక్షేమపధకాలు అందచేయుటలోను మరియు ప్రజలకు మరింత సేవలు అందించడం కొరకు సిబ్బంది అందరూ పాటుపడాలని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన గౌరవ జిల్లా ఇన్చార్జి మినిష్టరు వారి చేతుల మీదుగా అవార్డులు అందుకోబోతున్న అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ పి యం సత్యవేణి, డిప్యూటి కమిషనరు జి.సాంబశివరావు, సిటీ ప్లానర్ వైబీఆర్ చంద్రబోస్, సూపరింటెండెంట్ ఇంజనీరు జి. పాండు రంగారావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. ఎ.వినూత్న మరియు ఇతర మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *