విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో మొట్టమొదటిసారిగా మెర్సిలైస్ ఐస్‌క్రీమ్ కేఫ్ నూతనంగా ప్రారంభమైంది. శనివారం విజయవాడ, ఏలూరురోడ్డు, పడవలరేవు, మాచవరం డౌన్‌లో మెర్సిలైస్ ఐస్‌క్రీమ్ సెంటర్‌ను నూతనంగా ప్రారంభించారు. సరికొత్తగా వ్యాపారరంగంలో చంద్రశేఖర్ ఫ్యామిలీ, కృష్ణవేణి ఫ్యామిలీ వ్యాపార భాగస్వాములుగా కలిసి సంయుక్తంగా మెర్సిలైస్ ఐస్‌క్రీమ్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రశేఖర్, కృష్ణవేణిలు మీడియాతో మాట్లాడుతూ మెర్సిలైస్ ఐస్‌క్రీమ్ కేఫ్‌లో సీతాఫల్, ట్రెండ్ కోకోనట్, స్ట్రాబెరీ, చెర్రీస్ మొదలగు స్పెషల్ ఐటమ్స్ గల ఐస్ క్రీములు ప్రత్యేకంగా లభించునని తెలిపారు. ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేట్విస్ లేకుండా ఫ్రూట్స్ నుండి తయారు చేసి హానీ బేసిడ్‌గా అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఆధునాతన మిషనరీలతో తయారుచేసి మంచి క్వాలిటీతో పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా తమకు నచ్చిన డెసర్ట్స్‌ను అతి తక్కువ క్యాలరీలు కలిగినవి తిని ఆస్వాదించవచ్చునని అన్నారు. వివిధ రకాల ఫంక్షన్లకు బల్క్‌గా ఆర్డర్ల ద్వారా డిస్కౌంట్‌తో సప్లై చేయబడినని తెలిపారు. తమ వద్ద వివిధ రకాల గల ఐస్ క్రీములకు అతి తక్కువ ధరల్లో లభించునని తెలిపారు. పార్శిల్ పట్టుకెళ్లే వారికి కూలింగ్ పోకుండా జల్లి ప్యాక్ చేసి ఇవ్వబడునని చెప్పారు. ఇలా బ్యాక్ చేయడం వల్ల నాలుగు గంటల వరకు ఐస్ క్రీమ్ కూలింగ్ పోకుండా పాడవకుండా కరిగిపోకుండా ఉంటుందని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఐస్‌క్రీమ్ సెంటర్ ప్రజలందరూ సందర్శించి తమ వ్యాపార అభివృద్ధికి ఆదరించాల్సిందిగా కోరారు. హోమ్ డెలివరి సదుపాయం కూడా ఉన్నదని, పార్టీలకు ఫంక్షన్‌లకు సప్లయి చేస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News