-డిసిహెచ్ఎస్ డా సనత్ కుమారి
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
అనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ కర్త డా ఎం. సనత్ కుమారి తెలిపారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా విధుల్లో ఉన్న డాక్టర్లను, సిబ్బంది గుర్తించడం తో ముఖ హాజరు వివరాలు పరిశీలించి ధ్రువీకరించడం జరిగిందన్నారు.ఏరియా ఆసుపత్రి లో ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు వైద్య సేవలు అందించిన వాటి వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్ లో అప్లోడ్ చేయవలసినదిగా ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలు తీరును పరిశీలించినట్లు పేర్కొన్నారు. తనిఖీలో భాగంగా రికార్డులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రి పరిధిలో ఏఎన్‌ఎంల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాంతీయ సంచాలకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డా. సనత్ కుమారి ఆదేశించారు .
Prajavartha Online Telugu News