-నేడు (ఆగస్ట్ 21) కలెక్టరేట్ లో పోలీసు స్పందన అర్జీలు స్వీకరణ
– కలెక్టర్ డా కే.మాధవీలత
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి నెల మూడో సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందన లో రెవెన్యూ, ఇతర శాఖల అర్జీలతో పాటు పోలీసు శాఖ కు చెందిన స్పందన అర్జీలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు.అదే విధంగా డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం ఆగస్ట్ 21 సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతీ నెల మూడో సోమవారం పోలీసు అధికారులు , కలెక్టర్ కలిసి స్పందనలో అర్జీల స్వీకరించే ప్రక్రియలో భాగంగా ఆగస్ట్ 21 న జిల్లా కలెక్టర్ , పోలీసు అధికారులతో కలిసి ప్రత్యేక స్పందనరాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు .అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు.జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో స్పందన ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు. మండల స్థాయి అధికారులు అందరూ మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించాలన్నారు.
Prajavartha Online Telugu News