Breaking News

స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరుకి జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్

-దక్షిణ భారతదేశంలో గుంటూరు నగరానికే గుర్తింపు
-సెప్టెంబర్ 7 న భోపాల్ లో అవార్డ్ అందుకోనున్న మేయర్, కమిషనర్
-నగర ప్రజలు, అధికారుల సహకారంతోనే జాతీయస్థాయి గుర్తింపు
-నగర మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మరియు క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) చేపట్టిన స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్, దక్షిణ భారతదేశంలో గుంటూరు నగరానికే ర్యాంక్ దక్కిందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మరియు క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) చేపట్టిన స్వచ్చ వాయు సర్వేక్షణ్ పోటీల్లో జాతీయ స్థాయిలో 131 నగరాలు పోటీ పడ్డాయని, అందులో 10 లక్షలలోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3 వ ర్యాంక్ దక్కిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఈ అవార్డ్ ఒక్క గుంటూరు నగరానికే దక్కడం గర్వకారణమన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్చ వాయు సర్వేక్షణ్ అంశాల్లో పరిశీలించి, 2023-24 ఆర్ధిక ఏడాదికి ఉత్తమ నగరాలను సిఫార్స్ చేసిందన్నారు. అవార్డ్ ను సెప్టెంబర్ 7 న మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తారని తెలిపారు. నగర ప్రజలు, అధికారుల సహకారంతోనే జాతీయ స్థాయిలో గుంటూరు నగరానికి ఉత్తమ ర్యాంక్ అందిందన్నారు. 10 లక్షలలోపు జనాబా కేటగిరిలో తొలి మూడు స్థానాల్లో వరుసగా అమరావతి, మోర్దాబాద్, గుంటూరు నగరాలు నిలిచాయని, 3 లక్షలలోపు జనాభా కేటగిరిలో పర్వనో, కలాంబ్, అంగుల్ నగరాలు తోలి మూడు స్థానాలు సాధించాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *