Breaking News

స్థానిక సి.టి.ఆర్.ఐ.లో శనివారం పంటల యాజమాన్య పద్దతుల విభాగంలో పరిశోధనా సమావేశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సి.టి.ఆర్.ఐ. సంస్థ లో మూడు రోజుల పాటు జరుగుతున్న పరిశోధనా కమిటీ సమావేశాలలో మూడోవ రోజు కూడా సుదీర్ఘ చర్చలు జరిగాయి.పంటల యాజమాన్య పద్ధతులు మరియు భూసార మరియు రసాయన విభాగంలోని పరిశోధనలపై చర్చించారు.అధ్యక్షులు ICAR CRIDA హైదరాబాద్ లోని అగ్రానమి విభాగాధిపతి డా. రవీంద్రాచారి మాట్లాడుతూ సమగ్ర పోషకాల యాజమాన్యం లో ఖచ్చితమైన పరిశోధనా ప్రణాళికలు ఏర్పరచుకోవాలన్నారు . అప్పుడే పరిశోధనల ఫలితాలు, తత్సంబంధిత సమాచారం ఖచ్చితమైన ప్రమాణాలతో కూడి ఉంటుందని తెలియజేసారు. శాస్త్రవేత్తలు తమ తమ ప్రయోగాలలో వివిధ రకాల ట్రీట్మెంట్స్ లో ఎన్నో రకాల అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. వాతావరణం లోని విభిన్న అంశాలైన ఉష్ణోగ్రత, వర్షపాతం, భూసార అంశాలు, నేలలోని అజో స్పైరిల్లమ్, ఫాస్ఫో బాక్టీరియా, మైక్రోఫ్లోరా వంటి విభిన్న అంశాలను లోతుగా పరిశీలించి, పరిశోధించాలని సి.టి.ఆర్.ఐ. డైరెక్టర్ డా. శేషు మాధవ్ తెలియజేసారు.విభాగంలోని శాస్త్రవేత్తలు తమ తమ పరిశోధనా ఫలితాలను వెల్లడించారు. ప్రతి సబ్ స్టేషన్ లోనూ ఉన్న పరిశోధనా ప్లాట్స్ ను నిపుణుల పర్యవేక్షణతో ప్రయోగాలు జరపాలని డా. ఎం. శేషు మాధవ్ తెలియజేసారు.పూర్వ విభాగాధిపతులు డా. యూ. ధర్ మరియు డా. సి. చంద్రశేఖర రావు ఈ పరిశోధనా ఫలితాలను క్షున్నంగా పరిశీలించి తమ సూచనలను అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *