-ప్రతి ఇంటివద్ద ఇంకుడు కుంట లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు.
-నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి ఉచితంగా విద్యు త్ కనెక్షన్.
– ప్రతి శనివారం హౌసింగ్ కార్యక్రమంలో క్షేత్ర స్థాయి లో పర్యటన.
– గృహ నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి.
-జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్న కాలనీల్లో లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, లబ్దిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేసి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.శనివారం ఉదయం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో జగనన్న కాలనీ లే అవుట్ లో నిర్మించిన గృహ నిర్మాణాలను కలెక్టరు అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే మాధవీ లత మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వం ఉచితంగా అందచేసిన ఇంటి స్థలంలో త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు కుంటలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లకు తెల్లరంగు వేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్ పి. రేవతి ఇంటిని సందర్శించిన కలెక్టరు మాధవీలతకు.. హారతి ఇచ్చి సాదర స్వాగతం పలికారు. కలెక్టర్ ఇంటిని పరిశీలించి, శుభాకాంక్షలు తెలిపారు.కాపవరం లే అవుట్ లో 302 ప్లాట్స్ గాను తొలి దశలో 209 గృహనిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకు 94 ఇళ్ళు నిర్మాణం పూర్తయ్యిందని, బీబీఎల్ దశలో 55, బిఎల్ దశలో 53, ఆర్ఎల్ దశలో 4, ఆర్సీ దశలో 3 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇళ్లు నిర్మాణాలు కొరకు ఎస్ హెచ్ జీ గ్రూపు లబ్దిదారులు 194 మందికి రూ.35 వేల రూపాయలు చొప్పున అదనపు రుణాలు మంజూరు చేసామని జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ కాలనీలో ఇప్పటి వరకు అంతర్గత రహదారుల నిర్మాణం కొరకు రూ.9.90 లక్షల రూపాయలు, గృహనిర్మాణాలకు అవసరమగు నీటి సౌకర్యం కొరకు రూ. 28 లక్షల రూపాయలు, ఇళ్ల స్థలాల లెవిలింగ్ కొరకు రూ. 30 లక్షలు రుపాయలు ఖర్చు చేసామన్నారు. పూర్తయిన ఇళ్లు డ్రోన్ కెమెరాలతో ఫొటోస్, వీడియోలు తీయించాలన్నారు. కలెక్టర్ లే అవుట్ ను అక్కడ కలుగ చేస్తున్న మౌలిక సదుపాయాలు పట్ల సంతృప్తి వ్యక్త పరిచారు.అనంతరం కలెక్టర్ మాధవీలత లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం కొంత శ్రమతో కూడుకున్నా, మీ వారసులకు ఒక ఆస్తి హక్కు కల్పించే బృహత్తార అవకాశం అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు పెట్టుబడి సహాయంగా రూ.35 వేలు ఇవ్వడం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ముడి సరుకులు ఇసుక, సిమెంట్, ఐరన్ ఇతర నిర్మాణ సరుకులు లే అవుట్ వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఇళ్ళ నిర్మాణం కోసం నీటి వసతి కల్పించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. మీరు ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగితే, ఆమేరకు దశల వారీగా చెల్లింపులు కూడా ఎప్పటి కప్పుడు మీ బ్యాంకు ఖాతాల కు నేరుగా జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ లే అవుట్ లలో విద్యుత్, త్రాగు నీరు, రహదారులు వంటి పను లను దశల వారీగా ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామని, ఇందుకోసం రూ.2500 లు చెల్లించనవసరం లేకుండా అధికారులే మీటర్ ఏర్పాటు చెయ్యడం జరుగు తుందని చెప్పారు. అధికారులు స్టేజ్ కన్వర్షన్ పై నిరంతరం దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా లే అవుట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్చ్ ను పరిశీలించి సూచనలు చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సిఎం పాల్గొనడం జరుగుతుందని, ఇందులో భాగంగా వర్చువల్ ద్వారా జిల్లాలో కాపవరం లే అవుట్ లోని గృహాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా హౌసింగ్ అధికారి జీ. పరశురామ్, కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, సర్పంచ్ లు సుంకర పద్మిని, సుంకర సత్యనా రాయణ, హౌసింగ్ డి. ఈ. ఈ., టి. శేఖర్ బాబు, ఎ. ఈ లు, కె. ఎస్. చక్రవర్తి, ఎస్. చాంబర్లీన్, ఎంపీడీవో కె. సుశీల, తహసిల్దార్, బి. నాగరాజు నాయక్, సచివాలయ సంక్షేమ కా ర్యదర్శులు, లబ్దిదారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News