మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సీసీఎల్ఏ సాయి ప్రసాద్, అదనపు సిసిఎల్ఏ ఎ ఎం డి ఇంతియాజ్ గురువారం వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల్లో రీ సర్వే పురోగతి, రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ పురోగతి, మూడో దశ స్టోన్ ప్లాంటేషన్ పురోగతి, ఆన్లైన్ సబ్ డివిజన్ పురోగతి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ కలెక్టరేట్ నుండి విసీ లో పాల్గొన్నారు. జిల్లా ప్రగతి కలెక్టర్ సిసిఎల్ఏకు వివరిస్తూ రెండో దశ భూహక్కు పత్రాల పంపిణీ సంబంధించి 30, 159 భూ హక్కు పత్రాలు జిల్లాకు రాగా, వీటిలో 27,802 పంపిణీ గావించినట్లు తెలిపారు. మూడో దశ స్టోన్ ప్లాంటేషన్ సంబంధించి జిల్లాకు వచ్చిన 2282 స్టోన్స్ కు గాను, 1978 స్టోన్ ప్లాంటేషన్ జరిగిందన్నారు. మూడో దశ రీసర్వే డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లాలో 132 గ్రామాలలో రీసర్వే చేపట్టగా ఇప్పటివరకు 10 గ్రామాల్లో పూర్తయింది అన్నారు. సర్వే ఏడి టి వెంకటేశ్వరరావు వీసీ లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News