రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఏడు అంగనవాడి ప్రాజెక్టుల్లో 1556 అంగన్వాడి కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1538 అంగన్వాడి వర్కర్లు గాను ఇప్పటివరకు 164 మంది విధుల్లో చేరారని, అదేవిధంగా 1493 అంగన్వాడి సహాయకులకు గాను 162 మంది విధుల్లో చేరారని పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్లలో మెటర్నరీ, ఇతరులు కారణాల చేత 9 మంది, అంగన్వాడి హెల్పర్లు సంబంధించి 16 సెలవులో ఉన్నారని తెలిపారు. అంగన్వాడీ ప్రాజెక్టులు వారీ.. వివరాలు జిల్లాలో గోపాలపురం ప్రాజెక్టులో అంగన్వాడి వర్కర్లు సంబంధించి 234 కేంద్రాల్లో 232 మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 36 మంది విధుల్లో చేరాలని సహాయకులుగా పనిచేస్తున్న 216 మందిలో 30 విధుల్లో చేరారని తెలిపారు. అదేవిధంగా కొవ్వూరు ప్రాజెక్టులో 223 కేంద్రాల్లో 223 మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 39 మంది విధుల్లో చేరాలని సహాయకులుగా పనిచేస్తున్న 216 మందిలో 52 మంది, కోరుకొండ ప్రాజెక్టులో అంగన్వాడి వర్కర్లు సంబంధించి 228 కేంద్రాల్లో 225మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 17మంది విధుల్లో చేరారని, సహాయకులుగా పనిచేస్తున్న 217 మందిలో 14 మంది, రాజమండ్రి ప్రాజెక్టులో అంగన్వాడి వర్కర్లు సంబంధించి 165 కేంద్రాల్లో 162 మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 34 మంది విధుల్లో చేరారని, సహాయకులుగా పనిచేస్తున్న 160 మందిలో 31 మంది, రాజానగరం ప్రాజెక్టులో అంగన్వాడి వర్కర్లు సంబంధించి 311 కేంద్రాల్లో 306 మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 14 మంది విధుల్లో చేరారని, సహాయకులుగా పనిచేస్తున్న 302 మందిలో 13 మంది, రంగంపేట ప్రాజెక్టులో అంగన్వాడి వర్కర్లు సంబంధించి 184 కేంద్రాల్లో 179 మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 6 గురు విధుల్లో చేరారని, సహాయకులుగా పనిచేస్తున్న 180 మందిలో 7 గురు, పెరవలి ప్రాజెక్టులో అంగన్వాడి వర్కర్లు సంబంధించి 211 కేంద్రాల్లో 211 మంది పని చేస్తుండగా ఇప్పటివరకు 18 మంది విధుల్లో చేరారని, సహాయకులుగా పనిచేస్తున్న 202 మందిలో 15 మంది విధుల్లో జాయిన్ అయ్యారని కలెక్టరు డా. మాధవీలత ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News