Breaking News

ఎన్నిక‌ల ఏర్పాట్ల‌కు క‌లెక్ట‌ర్ క్షేత్ర‌స్థాయి త‌నిఖీలు

-అధికారుల‌తో క‌లిసి విజ‌య‌వాడ‌లో వివిధ ప్రాంతాల సంద‌ర్శ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నిక‌ల‌ను ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో స‌జావుగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని.. డిస్ట్రిబ్యూష‌న్‌, రిసెప్ష‌న్ కేంద్రాల‌తో పాటు స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు.. ఇలా ప్ర‌తి అంశంలోనూ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా గురువారం క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంక‌ర్‌, కేఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి త‌దిత‌రుల‌తో క‌లిసి గురువారం న‌గ‌రంలో వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ రిసెప్ష‌న్ సెంట‌ర్‌కు సంబంధించి ఎన్ఎస్ఎం ప‌బ్లిక్ స్కూల్‌ను, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ రిసెప్ష‌న్ సెంట‌ర్‌కు సంబంధించి గాంధీజీ మ‌హిళా క‌ళాశాల‌ను త‌నిఖీ చేశారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజున, పోలింగ్ త‌ర్వాత‌.. ఇలా మూడు ద‌శ‌ల‌కూ అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు అవ‌స‌ర‌మ‌య్యే వివిధ కేంద్రాల వ‌ద్ద విద్యుత్ స‌ర‌ఫ‌రా, సూచిక‌ల ఏర్పాటు, మౌలిక వ‌స‌తులు.. ఇలా ప్ర‌తి అంశంపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. భ‌ద్ర‌త ప‌రంగా కూడా ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. క‌లెక్ట‌ర్ వెంట రెవెన్యూతో పాటు వివిధ శాఖ‌ల అధికారులు ఉన్నారు.
నాణ్య‌త‌తో స‌త్వ‌రం ఫిర్యాదుల ప‌రిష్కారం: ప‌రఅ స్తుతం ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి (ఎంసీసీ) అమ‌ల్లో ఉన్నందున వివిధ మార్గాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎంసీసీ, ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫిర్యాదుల‌ను కంట్రోల్ రూం నెంబ‌ర్ (0866-2570051)కు ఫోన్‌చేసి తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *