Breaking News

అనుమ‌తుల‌కు సువిధ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

– నేరుగా కూడా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వీలు
– క‌నీసం 48 గంట‌లకు ముందు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
– అనుమ‌తులు లేకుంటే చ‌ర్య‌లు
– జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారానికి అవ‌స‌ర‌మ‌య్యే వాహ‌నాలు, ఇత‌ర అనుమ‌తుల మంజూరుకు సువిధ పోర్ట‌ల్ లేదా నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఎన్‌టీఆర్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రిటర్నింగ్ అధికారికి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, విజయవాడ పార్లమెంటరీ నియోజకవ‌ర్గం వారికి దరఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. వాహ‌నాల అనుమ‌తికి సంబంధించి దరఖాస్తుతో పాటు వాహ‌న రిజిస్ట్రేష‌న్ (ఆర్‌సీ బుక్‌) వివ‌రాలు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన యజమాని పేరు, డ్రైవర్ పేరు, చిరునామా, మొబైల్ నంబ‌రు త‌దిత‌ర వివ‌రాలు జ‌త‌చేయాల‌న్నారు. వాహ‌నం సంచరించే ప్రదేశాల వివరాలు, రూట్ మ్యాప్ తెలియ‌జేయాల‌ని.. వాహన తనిఖీ అధికారి (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) నుంచి వాహ‌నాన్ని తనిఖీ చేయించుకుని స‌ర్టిఫికేట్ పొందాల‌న్నారు. తాత్కాలిక ఎన్నికల కార్యాలయం ఏర్పాట్ల‌కు అనుమతి కోసం భవన యజమాని అనుమతి లేదా అద్దె వివరాలు, ఇతర అంచనా వ్యయం త‌దిత‌ర వివ‌రాల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నారు. ర్యాలీలు, రోడ్ షోలు వంటి కార్యక్రమాల అనుమతికి ప్రదేశం, రూట్ మ్యాప్, ర్యాలీలో పాల్గొను వారి సంఖ్య, తేదీ, సమయం త‌దిత‌ర వివ‌రాల‌ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి తెలియ‌జేసి అనుమ‌తి పొందాల‌న్నారు. బహిరంగ సభల నిర్వహణ సమయంలో వీఐపీ లేదా వీవీఐపీలు సందర్శన సమయంలో హెలిప్యాడ్ ఏర్పాటు అనుమ‌తి కోసం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి అనుమ‌తి కోసం ముందుగా ద‌ర‌ఖాస్తు చేయాల‌న్నారు. ఎలాంటి అనుమ‌తికోస‌మైనా క‌నీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేయాల‌ని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వ‌హించినా, అనుమతి లేకుండా వాహ‌నాల‌ను ఎన్నికల ప్రచారానికి వినియోగించినా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా పరిగణించి తగు చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు స్ప‌ష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *