Breaking News

అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చెక్ పోస్టులు వద్ద విధులను నిర్వర్తించే వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కడియం మండలం పొట్టి లంక చెక్ పోస్ట్ ను ఎస్పి పి. జగదీష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం లో చెక్ పోస్టులు వద్ద విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం కలిగి ఉండాలని పేర్కోన్నారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించే క్రమంలో ప్రతి ఒక్క అంశం రికార్డు చెయ్యడం, రిజిస్టర్ లో ఆయా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలనీ ఆదేశించారు. పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రెవిన్యూ, అటవీ శాఖ ఇతర శాఖల చెక్ పోస్ట్ లో బాధ్యతలు నిర్వహించే వారీ మధ్య సమన్వయం సాధించడం అత్యంత కీలకం అన్నారు. ఇప్పటి వరకు ఈ చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష 40 వేల రూపాయల సీజ్ చేసినట్లు చెక్ పోస్ట్ సిబ్బంది వివరాలు అందచేశారు. ప్రతి తనిఖి వివరాలు తప్పని సరి వీడియో రికార్డింగ్ చెయ్యలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలియ చేశారు. తనిఖీల సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలియ చేశారు. స్నేహ పూర్వక విధానంలో బాధ్యతలు చేపట్టాలన్నారు. అనంతరం చెక్ పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న మూడు షిఫ్ట్ ల సిబ్బంది హజరు , రికార్డుల నిర్వహణ ను పరిశీలించి, తగిన సూచనలు చెయ్యడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *