– ఎన్నికల విధుల్లో సిబ్బంది ద్వారా ఫారం 12 స్వీకరణ
– రూరల్ నియోజక వర్గ ఆర్వో కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు
-ఏప్రియల్ 22 వ తేదీ వరకు స్వీకరణ
– జేసి రూరల్ ఆర్వో తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టర్ ఏన్.తేజ్ భరత్ జేసి ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించడం, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన వివరాలు పై అధికారులకి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భం గా, రాజమండ్రి రూరల్ నియోజక వర్గ ఆర్వో జెసి ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ రాజీకీయ ప్రతినిధులకు నామినేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు. నామినేషన్ రోజున నామినేషన్ వేసే అభ్యర్ధి తో పాటు మరో నలుగురికి మాత్రమే అనుమతి వుంటుందని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియ మీద ఎటువంటి సందేహాలు వున్నచో జెసి ఛాంబర్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నందు సహాయం తీసుకోవాల్సింది గా, నమూనా నామినేషన్ల పరిశీలన చేయవలసినదిగా తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియ ను సరైన విధము గా పాటిస్తున్నారో లేదో తెల్సుకోవడానికి ప్రతినిధులకు చెక్ లిస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగినదని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలు – 2024లో భాగంగా ఇతర పోలింగ్ అధికారి (ఓపీఓ) మరియు మైక్రో అబ్జర్వర్‌గా తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేయడానికి రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫారం 12 సేకరణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. . కాబట్టి, 51-రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ఇతర పొలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ ఫారం 12 దరఖాస్తుతో పాటు వారికి జారీ చేసిన డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు ఓటరు గుర్తింపు కార్డు కాపీ, ఆర్డర్ కాపీ మరియు ఆధార్ కాపీని సమర్పించాల్సి ఉంటుందనితెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రంలో ఏప్రియల్ 22 వ తేదీ సదరు వివరాలు నేరుగా అందచెయ్యలని తేజ్ భరత్ తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజెపి ఎన్ వీ బి ఎన్ ఆచారి, టీడీపీ జి. సత్యనారాయణ , సీపీఎం కె. రామకృష్ణ, వైసిపి చెల్లుబోయిన నరేన్, ఒంటెడ్డి వి వి సత్యనారాయణ, రూరల్ తహశీల్దార్ వై. కె. వి. అప్పారావు, కడియం తహశీల్దార్ బి. రమాదేవి, ప్లానింగ్ అధికారి కోటయ్య , డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News