Breaking News

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ లో అఫిడవిట్ దాఖలు సక్రమంగా దాఖలు పర్చాలి

-ఎన్నికల ప్రచారం, సమావేశాల్లో బాలలను ఉపయోగించరాదు
– నామినేషన్ల ఉదయం 11 నుంచి మ.3 వరకు స్వీకరణ ఉంటుంది
-ఓటు హక్కు కోసం పెండింగు ఫారాలు పూర్తి స్థాయిలో పరిష్కారము చెయ్యడం జరుగుతుంది
– పి వో, ఏ పి వో లకి ఏప్రిల్ 15 న తొలి శిక్షణ కార్యక్రమం
– కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నామినేషన్ల ప్రక్రియ లో నామినేషన్ల పత్రాలు, అఫిడవిట్ దాఖలు చెసే విధానంలో అభ్యర్ధులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని , ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కోసం దాఖలు చేసిన ఫారాలను నిర్ణీత వ్యవధిలో పరిష్కారము చేయటం జరుగుతుందనీ తెలిపారు. ఎన్నికల ప్రచారం లో మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై రిటర్నింగ్ అధికారులు ఆద్వర్యంలో క్షేత్ర స్థాయిలో తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం, జీత భత్యాలు తీసుకునే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం, ఎఫ్ ఐ ఆర్ లని నమోదు చెయ్యడం జరిగిందని పేర్కోన్నారు. ఉల్లంఘన కు పాల్పడిన ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు మాధవీలత తెలియ చేశారు. ఆమేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ద్వారా, వివిధ మాధ్యమాల్లో ప్రచురితమైన ప్రతికూల, ప్రసారం అవుతున్న కథనాలు విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచార అంశాలకి సంబంధించిన విచారణ జరిపి, విధుల నుంచి తొలగించడం జరిగిందనీ తెలియ చేశారు. రాజకీయ పార్టీలు, పోటిలో నిలిచే అభ్యర్థులు బాలలను ఎన్నికల ప్రచారంలో, కరపత్రాలు పంపిణీ, ర్యాలీలలో , ప్రచార సభల్లో వారీ సేవలు వినియోగిస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందనీ హెచ్చరించారు. ఏప్రియల్ 12 న పార్లమెంటు కి చెందిన, ఏప్రియల్ 13 న అసెంబ్లీ నియోజక వర్గాల కు చెందిన బ్యాలెట్ యూనిట్స్ తొలి ర్యాండమనైజేషన్ చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలిపారు. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమనైజేషన్ చెయ్యడం జరుగుతుందనీ , అందుకు అనుగుణంగా సిద్దం కావాలని కోరారు. ఈరోజుకి ఆరోజు బ్యాలెట్ ఈ వి ఎమ్, అనుబంధ యూనిట్స్ ర్యాండమనైజేషన్ విధానంలో ఆయా నియోజక వర్గాల కు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఒకొక్క బ్యాలెట్ బాక్సు పెట్టాలో 10 ఈవీఎమ్ యూనిట్స్ ఉంటాయని, వాటినీ ర్యాండమనైజేషన్ చేసి ఒకొక్కదానిని ఒక్కో నియోజక వర్గానికి కేటాయించి వాటి వివరాలు నమోదు చేసి, రాజకీయ పార్టీల సమక్షంలో నిర్దారణ చేసుకోవడం జరగనున్నట్లు తెలిపారు. ఫారం 6 కు చెందిన 3494 , ఫారం 7 కి చెందిన 1747 , ఫారం 8 కి చెందిన 6621 పెండింగులో ఉన్నట్లు వీటిని నిర్ణీత సమయం లోగా పరిష్కారం చేయనున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు.  ఏప్రియల్ 14 వరకు కొత్త గా యువ ఓటర్లు ఓటరు నమోదు, ప్రస్తుత ఓటర్లు చిరునామా మార్పుకి అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు వాటినీ పూర్తి స్థాయిలో పరిష్కారము చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, డిఆర్వో జి. నర్సింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ – ఎన్. రమేష్ @ శ్యామ్ , బిజెపి – జి. వెంకట రావు,   సీపీయం – ఎస్ ఎస్ మూర్తీ, వైఎస్ఆర్ సీపీ – వై వి ఎస్ శ్యామల, కలక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *