Breaking News

బీజేపీలో చేరిన పైలా సోమినాయుడుతో వైసిపి శ్రేణులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, దుర్గ గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ భవానిపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పశ్చిమ ఎమ్మెల్యే బిజెపి అభ్యర్థి సృజన చౌదరి పైల సోమినాయుడుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పైలా సోమినాయుడు మాట్లాడుతూ సిఎం అపాయింట్ మెంట్ కోసం నెలల తరబడి వేచి ఉన్నా అపాయింట్ మెంట్ లభించక పోవడం తనకు మనస్తాపం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక దుర్గ గుడి చైర్మన్ గా తనకు పొడిగింపు లభించక పోవడం వెనుక ఎమ్మెల్యే వెలంపల్లి హాస్తం ఉందని ఆరోపించారు. పశ్చిమ నియోజక వర్గం లోని 22 డివిజన్లలో పర్యటించి అన్ని వర్గాల ప్రజలను కలసి సుజనా చౌదరి విజయానికి సహకరిస్తానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య పైలా ప్రకటించారు. ఈ సందర్భంగా పైలా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు. పశ్చిమ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. డబల్ ఇంజన్ సర్కారు మళ్ళీ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి నాయకులు పట్నాయక్, జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాధిత శంకర్, జనసేన నాయకులు షేక్ గయాజుద్దీన్, అమ్మి శెట్టి వాసు, రజనీ, పైలా సురేష్, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *