Breaking News

బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయులు పూలే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో వివక్షకు గురి అవుతున్న బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి, వారిలో చైతన్యం కలిగించి సామాజికంగా ఎదుగుదల కు ఎనలేని కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా నియోజకవర్గంలో 5వ డివిజన్ క్రీస్తురాజు పురం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే జీవితం అందరికి ఆదర్శం అని,వారి బాటలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ ప్రతి సంక్షేమ పథకాలు అమలు లో,రాజకీయా,నామినేటెడ్ పదవులలో వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్,వైసీపీ నాయకులు కోటి నాగులు,సుబ్బరాజు,డేవిడ్ రాజు,క్లైవ్,విఠల్,చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *