-తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎక్స్పెండిచర్ పర్యవేక్షణ అధికారులతో సమీక్షించిన ఎన్నికల కమిషన్ నుండి కేటాయించబడిన వ్యయ పరిశీలకులు వి.జి. శేషాద్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల బరిలో పాల్గొనే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను సంబంధిత అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అకౌంటింగ్ టీం లు సక్రమంగా రికార్డు నిర్వహణ చేయాలని ఎన్నికల కమిషన్ నుండి కేటాయించబడిన వ్యయ పరిశీలకులు వి.జీ శేషాద్రి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ నుండి కేటాయించబడిన వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల బరిలో పాల్గొనే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను సంబంధిత అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీం లు సక్రమంగా రికార్డు నిర్వహించాలని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాను పర్యటించి రికార్డులను పరిశీలిస్తానని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ చరణ్ రుద్రరాజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి నేటి వరకు ఎక్స్పెండిచర్ మరియు అకౌంటింగ్ టీములు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీములు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News