– సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యవహరించాలి
– వీడియో రికార్డింగ్, రికార్డుల నిర్వహణ పై వాకబు
– మీడియా మోనటరింగ్, ఎన్ కోర్, సి విజిల్, ఎమ్ సి సి విభాగాల పరిశీలన
– స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన నీనా నిగమ్
– చెక్ పోస్ట్ లో వద్ద పటిష్టమైన నిఘా పెట్టాలి
– ఎన్నికల కమిషన్ కు కళ్లు , చెవులు, నోరుగా ఎన్నికల సిబ్బంది పై గురుతరమైన బాధ్యత ఉంది.
-రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యయ అంచనాల విషయంలో ఎంతో సున్నితత్వం భావించడం జరిగిందని నీనా నిగమ్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు సమన్వయ కమిటీల, నోడల్ అధికారుల తో సీజర్ నిర్వహణా, ఖర్చుల వివరాలు , ఆడిటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ మాట్లాడుతూ, నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అన్నారు. ఎన్నికల కమిషన్ కు కళ్లు , చెవులు, నోరుగా ఎన్నికల సిబ్బంది పై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునెలా ఎన్నికలను నిర్వహించడం లో ఖర్చులను అభ్యర్థుల ఖాతాలకి చూపడంలో నిస్పక్ష పాతంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు, సన్నద్ధత ప్రణాళిక పట్ల నీనా నిగమ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. రిజిస్టర్ రాజకీయ పార్టీల అభ్యర్థులు , గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు వారు చేస్తున్న ప్రచార ఖర్చుల , బహుమతుల పంపిణీ, ఇతర ఖర్చులపై సమగ్ర దృష్టి పెట్టాలని సూచించారు. వాటిపై అభ్యర్థులకు అవగాహన కలిగి ఉండాలని, ఆమేరకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంకుల నుంచి జరిగే అనుమానాస్పద నగదు లావాదేవీలు, భారీ మొత్తంలో జరిగే లావాదేవిలు, నగదు డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు, స్టాక్ షాపులకు వెళ్ళే సరకు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. భారీ ఎత్తున లావాదేవీల విషయంలో మరింతగా నిఘా పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ, అలాగే ఎన్నికల ప్రచారాన్ని తనిఖీ చేయడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని తెలియ చేశారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న తీరును వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ అడిగి తెలుసుకున్నారు. వాటి విషయంలో పారదర్శకత జవాబుదారీతనం ఉండటం అత్యంత ప్రాధాన్యత కూడుకున్నదని నీనా నిగమ్ పేర్కొన్నారు. పత్రికలు, ఛానళ్ళు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అనుకూల , ప్రతికూల కథనాలు , చెల్లింపు వార్తలు తదితర అంశాలపై నీనా నిగమ్ అడగడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల ద్వారా ఇంటెన్సివ్ వాహనాల తనిఖీలు నిర్వహించడం, రాష్ట్ర/జిల్లా ఎక్సైజ్ శాఖలు ఎన్నికల సమయంలో ఇంటెన్సివ్ తనిఖీల ద్వారా మద్యం చెలామణిని నిరోధించే విధానం , నగదు, ఉచితాలు , మద్యం పంపిణీని నిరోధించడానికి గట్టి నిఘా ఉంచాలన్నారు. ఓటర్లు, అధికారులు ఆన్‌లైన్‌లో నగదు ప్రవాహాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అలాగే జీఎస్టీ పన్ను సంబంధిత ప్రయోజనం కోసం మాత్రమే తనిఖీ చేయవద్దని, ఓటర్లకు పంపిణీ చేయడానికి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడానికి కూడా తనిఖీ చేయాలని డిపార్ట్‌మెంట్‌కు సూచించారు. కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మాట్లాడుతూ పారదర్శకంగా, సజావుగా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక వ్యయ పరిశీలకులు సూచనలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఎన్నికలలో అభ్యర్ధులు చేసే ప్రచారం ర్యాలీలు పై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రికార్డు చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆయా ఆధారాలు ఆధారంగా ఆయా వ్యయాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్ధులు అందచేసే ఖర్చుల వివరాలు తో సరి చూడడం జరుగుతుందనీ తెలిపారు. సమగ్రమైన కార్యచరణ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నట్లు మాధవీలత వివరించారు. ముందస్తు అనుమతి మేరకు ఆడిటింగ్ అధికారుల ద్వారా ఖర్చులను ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పి పి. జగదీష్ వివరిస్తూ జిల్లాలో తొలుత ఎనిమిది సమీకృత చెక్ పోస్ట్ లని ఏర్పాటు చేశామని, తదుపరి మరో ఎనిమిది చెక్ పోస్ట్ లని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్, రెవిన్యూ, రవాణా, అటవీ, సెబ్, ఎక్సైజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో సమ్మిళితం చేసి ఏకీకృత శాఖల ఉద్యోగులు నియమించి నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పి పి జగదీష్, ట్రైనీ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, డి ఆర్వో జీ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News