Breaking News

స్వీప్ ఫోటో ప్రదర్శన తిలకించిన నీనా నిగమ్

-92 సంవత్సరాలు పైబడిన ఓటరు ఓటు హక్కు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వివరించిన కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించు కోవడానికి 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఆసక్తి కనపరచడం శుభ సూచకం అని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ పేర్కొన్నారు . ఆదివారం సాయంత్రం కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శన కలెక్టర్ మాధవీలత తో కలిసి తిలకించారు. ఈ సందర్బంగా నీనా నిగమ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునే శాతం తక్కువగా ఉందనీ, అటువంటి వారికి 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ముందుకు వచ్చి ఓటు వెయ్యడం స్పూర్తి కల్పిస్తుందని అన్నారు. ప్రతి ఎన్నికలల్లో వృద్దులు ఓటు హక్కును వెయ్యడమే కాకుండా, గత 40 , 50 ఏళ్ళ కాలంలో తాము ఇన్ని సార్లు ఓటు వేసినట్లు పేర్కొనడం గమనార్హం అని పేర్కొన్నారు. యువత ఇటువంటి వారిని నుంచి స్ఫూర్తి పొందేలా ప్రదర్శన నిర్వహించడం పట్ల కలెక్టర్ ను ఆమె అభినందించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 85 పైబడిన వారిలో పోలింగ్ కేంద్రానికి వొచ్చి ఓటు వెయ్యటానికి ఎక్కువ ఆసక్తి కనబరచడం జరుగుతోందని తెలిపారు. వృద్ధుల కోసం ఇంటి వద్దనే ఓటు హక్కును వేసే అవకాశం ఉందని , ఆ క్రమంలో అవగాహన కల్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటు హక్కును కలిగిన వారు కూడా తొలిసారి ఓటు హక్కును వేసేందుకు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని కలెక్టర్ తెలియ చేశారు. అంతకు ముందు మీడియ మానిటరింగ్ సెల్, చెక్ పోస్ట్ ల సిసి కెమెరాల ద్వారా పర్యవెక్షణ, సువిధ, సి విజిల్, ఎమ్ సి సి ఎమ్ సి, తదితర విభాగాలను పరిశీలించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *