-ప్రజల ఆశీస్సులు…. పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 25వరోజు ఎన్నికల ప్రచారం
-గుడ్లవల్లేరు మండలం గాదెపూడి… రెడ్డిపాలెం.. ఉలవలపూడి… వడ్లమన్నాడు పంచాయతీల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని
-అడుగడుగునా మంగళహారతులు…. గ్రామ గ్రామాన నీరాజనాలతో ఘన స్వాగతం పలుకుతున్న ప్రజానీకం
-రాష్ట్రంలో పేదరికం ఐదేళ్లలో గణనీయంగా తగ్గింది….చంద్రబాబు హయాంలో దోపిడీ, దౌర్జన్యాలు
-గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఐదోసారి కూడా నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి….
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే కొడాలి నాని 25వ రాజు ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసింది. గుడ్లవల్లేరు మండలంలోని గాదెపూడి.. రెడ్డిపాలెం.. ఉలవలపూడి.. వడ్లమన్నాడు గ్రామాల్లో ఎమ్మెల్యే నాని ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఉదయం గాదెపూడి, రెడ్డిపాలెం, నక్కలపాలెం, భీమునిగుంట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని….. మధ్యాహ్నం రెండవ పూట వడ్లమన్నాడు, కొండుపాలెం, మందవానిపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని గడపగడప ప్రచారం నిర్వహించారు. ముందుగా గాదెపూడిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సీపీ శ్రేణులు…. ప్రజానీకం గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు…. స్థానికులతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి….. ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ…. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, అడుగడుగునా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలుకగా,పూల మాలలతో ప్రజలు సత్కరించారు. ప్రచారంలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. క్రైస్తవ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు పూల వర్షాలు కురిపిస్తూ గజమాలలు వేస్తూ పార్టీ నాయకులు… అభిమానులు ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు….నాయకులు… అభిమానులు…. ప్రజలు…. ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక….. వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ప్రచారం ఆశాంతం తీన్మార్ డప్పుల మధ్య…. టపాసులు కాలుస్తూ స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు.. ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలే కాదు.. ఇవి మన పేదలను, ఇవి మన రైతులను, ఇవి పిల్లలను, ఇవి అక్క చెల్లెమ్మలను, ఇవి మన అవ్వాతాతలను, ఇవి పేద సామాజిక వర్గాలన భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలుగా కొడాలి నాని పేర్కొన్నారు.. మంచి చేసిన ప్రజల మనసు గెలిచిన మన జగనన్నకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని.. కుట్రలతో మోసాలతో వస్తున్న
వారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో గుడ్లవల్లేరు మండల వైసీపీ అధ్యక్షుడు సాయన రవి, ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ పోలగాని రమాదేవి, సీనియర్ వైసీపీ నాయకులు పాలేటి చంటి, జిల్లా వ్యవసాయ కమిటీ సలహాదారు పెన్నేరు ప్రభాకర్ రావు, యువజన విభాగ అధ్యక్షుడు గుదేరవి, మహిళా విభాగ అధ్యక్షురాలు మరియు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత, మండల బూత్ కన్వీనర్ కోటప్రోలు నాగు,శ్రీ కొండాలమ్మవారి దేవస్థాన కమిటీ చైర్మన్ శేషం గోపి, ఎంపీటీసీలు ముక్కు సోమేశ్వరరావు, పెనుమాల పూర్ణ కవిత, కొడాలి కన్నమ్మ , ఈడే లక్ష్మి, మండ దిలీప్ కుమార్, సర్పంచులు కటికల జ్యోతి, వీర్నాల లక్ష్మణరావు, ముత్యాల సాంబయ్య, కాలిశెట్టి అర్జున్ రావు, మేడేపల్లి రవికుమార్, గళ్ళ అక్కయ్య,
వడ్లమన్నాడు పంచాయతీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
తోట సుబ్బయ్య, శేషం రాజశేఖర్, మండ బోసు, మన్యం వీరరాఘవులు, పామర్తి హరిబాబు, మన్నెం వీరరాఘవులు, మోదుగుమూడీ కోటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, కొణతం శివకృష్ణ, అడుసుమిల్లి రత్న, అడుసుమిల్లి ఐశ్వర్య, అడుసుమిల్లి రవి పవన్, మండ హరిబాబు, పామర్తి పైడేశ్వర రావు, బొల్లా సాయిబాబు, మోదుగుమూడీ శ్రీనివాసరావు, మెండు రత్నకుమార్, శివకర్ రావు, డేవిడ్, కృప రాజు, చాట్రగడ్డ సునీల్, కరుణ, ఫ్లోరా, విజయ,
గుడ్లవల్లేరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, కొడాలి సుధాకర్, మన్నెం చంటి, md బాజీ, పామిరెడ్డి సతీష్ రెడ్డి, కొనకళ్ళ సాయి, md ఇషాక్, యార్లగడ్డ వేణు, బొట్ల ఫణి, పోస్టల్ రాజు, పెనుమాల రంగారావు, యార్లగడ్డ పైడేశ్వరరావు, మహమ్మద్ రబ్బాని, జన్ను చిరంజీవి, దుగ్గి ఏసు రాజు, పామర్తి హరిబాబు, కొప్పర్తి ప్రసాద్, మన్నెం వీరయ్య,
నియోజకవర్గంలోని పలు గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొండపల్లి కుమార్ రెడ్డి, గిరి బాబాయ్, పిల్లి బెనర్జీ, సూరపనేని కళ్యాణ్, కసుకుర్తి బాబ్జి,,గంట సురేష్, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, జ్యోతుల మణికంఠ, చుండి బాబి, పాలడుగు రాంప్రసాద్, కొచ్చర్ల అనిల్, కొత్తూరి లక్ష్మీనారాయణ,పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News