Breaking News

మే13న ప్రజాస్వామ్య పండుగలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే13 పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పాక్షికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి ఎంఆర్ పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ గారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తో కలిసి మునిసిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, విద్యార్థులు, అధికారులు, తదితరులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించి అక్కడే ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీ పై తమ అమూల్యమైన సందేశం ప్రజాస్వామ్య పండుగలో మనం అందరం పాల్గొందాం, స్వేచ్ఛా పారదర్శక, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు. అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్ నందు ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా, నియోజవర్గ, బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మే 13 వ తారీకున జరిగే పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గతంలో 2019 సాధారణ ఎన్నికలలో, బై ఎలక్షన్ లలో పోల్ అయిన ఓటింగ్ శాతానికి మించి మన జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 90 నుండి 95 శాతం ఓటింగ్ జరిగేలా అన్ని రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎథికల్ ఓటింగ్ వేయాలని కోరారు. 85 సం.ల పై బడి పోలింగ్ కేంద్రాలకు రాలేని వారికి హోం ఓటింగ్, అబ్సెంటీ ఓటర్లు,పిడబ్ల్యుడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అలాగే పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన వీల్ చైర్స్, త్రాగు నీటి వసతి, విద్యుత్ ఏర్పాటు, షేడ్, ర్యాంపు తదితరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి మురళీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అమరయ్య, డిప్యూటీ కమిషనర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *