నారాయణవనం మండలం, సత్యవేడు నియోజకవర్గం, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆదివారం ఉదయం నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పలు నియోజక వర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను, ఇంటీరిం స్ట్రాంగ్ రూం లను, పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ తదితర ఎన్నికల సంబంధిత అంశాల పరిశీలనలో భాగంగా…
సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ స్టేషన్లు 141, 142, 143 లను పరిశీలించి సెక్టార్ అధికారులు, బిఎల్వో లతో మాట్లాడుతూ సదరు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో పోలీస్ బందోబస్తు సక్రమంగా ఉండాలని, పోలింగ్ కేంద్రంలో నీడ ఏర్పాటుకు షామియానా ఏర్పాటు ఉండాలని, ర్యాంపు తదితరాలను పరిశీలించారు. పోస్టు నుండి రిటర్న్ అయిన పెండింగ్ ఎపిక్ కార్డులు అన్నిటినీ సంబంధిత ఓటర్లకు బిఎల్వో ల ద్వారా అందచేయాలని సూచించారు. క్లైమ్స్ పెండింగ్ పై దృష్టి పెట్టి ఈ నెల 25 నాటికి పూర్తి కావాలని, ఎ ఎస్ డి లిస్ట్ పక్కాగా తయారు కావాలని, హోం ఓటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్, ఏర్పాటు, కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఈఆర్ఓ తెలిపారు. సెక్టరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కు విధులు కేటాయించబడిన సిబ్బందికి కనీస వసతులు ఏర్పాటు కల్పించాలని సెక్టరల్ అధికారులు, బిఎల్వో లను కలెక్టర్ ఆదేశించారు.
నారాయణవనం అనంతరం పిచ్ఛాటూరు మండల తాసిల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కలెక్షన్ కొరకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను, రిజిస్టర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఫారం 12 నందు పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా సేకరిస్తున్నారని అడిగి తెలుసుకుని మాట్లాడుతూ తహశీల్దార్లు తమ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు అందచేయు ఫారం-12 ధరఖాస్తులను ఒక రిజిస్టర్ నందు, ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు వివరములు వేరే రిజిస్టర్ నందు నమోదు చేయవలెనని ఆదేశించారు. సెక్టరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, హోం ఓటింగ్ 85 సం. పై బడిన వారిని సంప్రదించినప్పుడు వారికి పోలింగ్ కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లు వివరించి వారు పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ వేయడానికి అంగీకారం ఉంటే తదనుగుణంగా వారితో ఫోటో, రికార్డింగ్ ఉండాలని సూచించారు. ఎపిక్ పంపిణీ, క్లెయిమ్స్ పెండింగ్ ఏమి లేవని అధికారులు కలెక్టర్ కు వివరించారు. బందోబస్తు పూర్తి స్థాయిలో ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పిచ్చాటూరు మండలం అనంతరం నాగలాపురం మండలం సురుటుపల్లి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును, అక్కడ ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైవలేన్స్ టీమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులోని ఉన్న జీఎస్టీ అధికారులు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, పోలీస్, కేంద్ర బలగాలతో మాట్లాడి ఎలాంటి నగదు, మద్యం, డ్రగ్స్ తదితర ఓటర్ ప్రభావితం చేసే అంశాలపై 24X7 పూర్తి నిఘా ఉండాలి అని సూచించారు.
అనంతరం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గారు సత్యవేడు మండలం దాసుకుప్పం ఎస్ఎస్టీ పాయింట్ ను తనిఖీ చేసి అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే ఏలాంటివి రాకుండా కట్టడి చేయాలని, వీడియో రికార్డింగ్ ఉండాలని సూచించారు. అధికారులు వివరిస్తూ రాష్ట్ర పోలీస్, కేంద్ర బలగాలు, పంచాయితీ రాజ్ తదితర శాఖలు సమిష్టిగా మూడు షిఫ్టుల్లో 24X7 పని చేస్తున్నామని వివరించారు.
అనంతరం దాసుకుప్పం గ్రామం మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలోని 278, 279 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సెంట్రల్ పోలీస్, స్టేట్ పోలీస్ బందోబస్తు నిబంధనల స్కేల్ మేరకు ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిఎస్పీ శ్రీనివాస రావు కి సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, వెబ్ కాస్టింగ్, వీడియో గ్రఫీ ఉంటుందని తెలిపారు. క్లైంస్ పెండింగ్, ఎపిక్ డిస్ట్రిబ్యూషన్ పై సమీక్షించి పోలింగ్ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎఎస్డి లిస్టు పక్కాగా తయారు కావాలని ఎలాంటి బోగస్ ఓటింగ్ ఉండరాదని ఆదేశించారు.
అనంతరం సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఈవీఎం లను భద్రపరచు ఇంటీరిమ్ స్ట్రాంగ్ రూంను, పోలింగ్ సిబ్బందికి ఇచ్చే ఎన్నికల సామాగ్రి కిట్లను, కంపార్ట్మెంట్ యూనిట్ తదితర సామాగ్రిని పరిశీలించారు. ఈవిఎం సెకండ్ ర్యాండమైజేషన్ సెక్టార్ వారీ ఏర్పాటుతో బందోబస్తు నడుమ చేపట్టాలని సూచించారు. విజిటర్స్ రిజిష్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. పక్కనే ఉన్న డా.బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సత్యవేడు తాశిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఫెసిలిటేశన్ సెంటర్ ఏర్పాటు సూచించిన తేదీలలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు ఈఆర్ఓ నరసింహులు, నారాయణ వనం తహశీల్దార్ శంకర్ రావు సెక్టరల్ అధికారులు, బిఎల్వోలు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News