రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఈ వి ఎమ్ యూనిట్ లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ ఆయా నియోజక వర్గాల పరిధిలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం రాజమండ్రీ రూరల్ అసెంబ్లి నియోజక వర్గ ఈ వి ఎమ్ ల కమిషనింగ్ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ ఆధర్యంలో నిర్వహిస్తున్న ప్రక్రియని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఉన్న 1577 పొలింగ్ కేంద్రాల కోసం 1895 బ్యాలెట్ యూనిట్స్, 1895 కంట్రోల్ యూనిట్స్, 2050 వివి పాట్స్ కమిషనింగ్ చెయ్యడం జరిగిందన్నారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న కమిషనింగ్ కోసం తొలి రోజు ఏడు అసెంబ్లి నియోజక వర్గాలకు చెందిన ఈ వి ఎమ్ లలో అభ్యర్ధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్స్ లో ఏ విధంగా బ్యాలెట్ పత్రాలు జోడించడం జరుగుతున్నది తెలియ చేసినట్లు తెలిపారు. వారి సమక్షంలో ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభం చేసి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 21 బెల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో కమీషనింగ్ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు చొప్పున బెల్ ఇంజనీర్ల ను కేటాయించడం జరిగిందని తెలిపారు. పూర్తి స్థాయిలో నిఘా పెట్టి కమిషనింగ్ చెయ్యడం జరిగింది అని పేర్కొన్నారు.
నియోజక వర్గాల వారీగా ఈరోజు కమిషనింగ్ చేసిన అసెంబ్లి సిగ్మెంట్ ఈ వి ఎమ్ యూనిట్స్
040 – అనపర్తి : పొలింగ్ కేంద్రాలు 228 ; బ్యాలెట్ యూనిట్స్ 273 ; కంట్రోల్ యూనిట్స్ 273 ; విసిపాట్స్ 296 .
049 – రాజానగరం : 216 పొలింగ్ కేంద్రాలు ; 259 బ్యాలెట్ యూనిట్స్ ; 259 కంట్రోల్ యూనిట్స్ ; 280 విసిపాట్స్ .
050 – రాజమండ్రి సీటీ : 237 పొలింగ్ కేంద్రాలు ; 285 బ్యాలెట్ యూనిట్స్ ; 285 కంట్రోల్ యూనిట్స్ ; 310 విసిపాట్స్ .
051 – రాజమండ్రీ రూరల్ : 267 పొలింగ్ కేంద్రాలు ; 324 బ్యాలెట్ యూనిట్స్ ; 324 కంట్రోల్ యూనిట్స్ ; 348 విసిపాట్స్ .
054 – కొవ్వూరు (ఎస్సి) : 176 పొలింగ్ కేంద్రాలు ; 211 బ్యాలెట్ యూనిట్స్ ; 211 కంట్రోల్ యూనిట్స్ ; 228 విసిపాట్స్ .
055 – నిడదవోలు : 205 పొలింగ్ కేంద్రాలు ; 246 బ్యాలెట్ యూనిట్స్ ; 246 కంట్రోల్ యూనిట్స్ ; 266 విసిపాట్స్ .
066 – గోపాలపురం (ఎస్సి) : 248 పొలింగ్ కేంద్రాలు ; 297 బ్యాలెట్ యూనిట్స్ ; 297 కంట్రోల్ యూనిట్స్ ; 322 విసిపాట్స్
Prajavartha Online Telugu News