(జూన్ 28 భారతరత్న పి.వి జయంతి సంధర్భంగా)
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక సంస్కరణలను ఆర్థిక మంత్రి మేథాసంపన్నులు డాక్టర్ మన్ మోహన్ సింగ్ తో కలసి సరళీకృత విధానంతో మధ్య తరగతి లో ఒకరు విదేశాలకు వెళ్ళే విధానానికి దోహద పడి భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టి దేశ దశా దిశా మార్చిన పి.వి నరసింహారావు మీరు మా భారతదేశ ప్రజలపాలిట దైవమే…!!
పదిహేడు భాషలలో ప్రావీణ్యత సంపాదించి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన ‘వేయిపడగల’ను హిందీ లో ‘సహస్రఫణ’గా అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కరాన్ని పొందిన సరస్వతీ మాత మానసపుత్రులు పి.వి..!!
ముఖ్యమంత్రిగా అనుకోకుండా రాజీవ్ గాంధీ మరణాంతరం ప్రధానిగా అల్పసంఖ్యా బలంతో ఎన్నికై ఎన్నో ఆర్ధిక సంస్కరణలను ఒడి దొడుకులు అవమానాలు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రవేశపెట్టిన దేశాభివృద్ధికి తోడ్పడిన పి.వి. మీరు అపర చాణుఖ్యులే…!!
ఇన్సైడర్ పుస్తకం ద్వారా తాను ఎదురుకున్న పరిస్థితులను నిర్మొహమాటంగా తెలియచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు దేశ అత్యున్నత భారతరత్న పురస్కారానికే వన్నె తెచ్చిన మహనీయులు మీకివే భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్న అక్షర కుసుమాలు….!!