Breaking News

ఈ నెల 29 న మేగా జాబ్ మేళా..!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జూన్ 29వ తేదిన శనివారం 9:30 గంటల నుండి మచిలీపట్నంలోని పవిత్ర డిగ్రీ కాలేజ్ నందు మేగా జాబ్ మేళా నిర్వహించనున్నారు అని జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి.విక్టర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేగా జాబ్ మేళాలో హెటిరో లాబ్స్, పేటియమ్, అరభిందో,యలమంచిలి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్,ఎన్ సి ఎల్ ఇండస్ట్రీస్,యాక్ట్ ఫైబర్ నెట్,అపోలో,కాస – కియా మోటార్స్,ధ్రువంత్ సొల్యూషన్స్,మాత్రే హెచ్ ఆర్ ఇండియా,డామినీర్ ఇంటీరియర్స్,ఎఫ్ట్రానిక్స్,ఎన్ ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,లార్సెన్ & టబ్రో లిమిటెడ్ ఎల్ & ఆర్,ఏజోన్ సెక్యూరిటీ సోల్యూషన్స్,బి.జెడ్ ఫైన్సెర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో పలు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. కావున జిల్లాలోని పదవ తరగతి ఐటిఐ డిప్లమా మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు నిరుద్యోగుల పూర్తి బయోడేటా దృవ పత్రాలు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జీతభత్యం 14 వేల నుండి 25వేల వరకు వేతనం లభిస్తుందని తెలియపరిచారు.ఆసక్తి గల అభ్యర్థులు www.ncs.gov.in వెబ్ సైట్ లో వివరములు నమోదు చేసుకోగలరు.ఇతర వివరములకు 8142416211(వాట్సప్ కాల్)నెంబర్ సంప్రదించవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *