Breaking News

జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు అందరికీ అనుసరణీయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు అందరికీ అనుసరణీయం ఆదర్శనీయమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆప్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని నోబుల్ కళాశాలలో ఏర్పాటుచేసిన వ్యర్థాలతో 800 కళా ప్రదర్శనలను మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి సందర్శించారు. కళాకృతులు చాలా బాగున్నాయని మంత్రి కలెక్టరు విద్యార్థులను అభినందించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆలోచన విధానాలు ఎంతో గొప్ప వని పరిసరాల పరిశుభ్రత ఎవరి పనులు వారు చేసుకోవాలని ఆలోచన ధోరణి అందరూ ఆదర్శంగా తీసుకొని అనుసరించాలన్నారు. క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించవచ్చున్నారు

ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల చేత కళాకృతుల ఆవిష్కరణకు కీలక బాధ్యత తీసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని అభినందిస్తున్నానన్నారు. తాను ఇదే కళాశాలలో ఇంటర్ వరకు చదివానన్నారు. ఇదివరకు తాను స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువ కెరటాలు పేరుతో యువతలో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి సంవత్సరం యూత్ ఫెస్టివల్ నిర్వహించామన్నారు. దీంతో దేశంలో ఎక్కడైనా వెళ్ళగలమనే ధైర్యం యువతలో వచ్చిందన్నారు. మరలా అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

అలాగే మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ను కూడా నిర్వహించి అందులో ఇటువంటి వ్యర్థాలతో కళా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తామన్నారు. కళాకృతులను మరింత అద్భుతంగా తయారు చేయవచ్చన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పోటీలో ఎంపిక కాకపోతే ఓడినట్లు కాదని అధైర్య పడడం గానీ, నిరాశ చెందడం గానీ చేయరాదన్నారు. వారు మరింత పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా విజయం వారి సొంతం అవుతుందన్నారు.
ఓటమి విజయానికి తొలిమెట్టు అన్నారు. బహుమతి రానంత మాత్రాన వారిలో సృజనాత్మకత తక్కువ ఉందని కాదని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఆలోచిస్తుంటారని ఇతరులు చేసిన ఆకృతులను గమనించి వారిలో దాగివున్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలన్నారు. కొన్ని కళాకృతులు గమనిస్తే వాటిని గనుక ఆన్లైన్లో పోస్ట్ చేసిన పక్షంలో మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యర్థాలతో తయారుచేసిన కళాకృతులు మరల వ్యర్థం కాకుండా పదిలపరిచే విధంగా రెండు రోజుల్లో మంచి కళాకృతులను గుర్తించి వాటిని జిల్లాకు వచ్చే ప్రముఖులు మంత్రులు తదితరులకు జిల్లా తరపున జ్ఞాపికలుగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.

అనంతరం ఉత్తమ కళాకృతులు ప్రదర్శించిన వారిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు పాఠశాలలను మంత్రి ప్రకటించారు. ఒక్కో స్థానంలో ఇద్దరేసి విద్యార్థులను ఎంపిక చేశారు. మొదటి బహుమతి కింద 25 వేల రూపాయలు లేడీయంప్తిల్ , అవనిగడ్డ పాఠశాలలకు చెందిన విద్యార్థులు షేక్ అబీద, శాకం మహేష్ లకు దక్కింది.

రెండవ బహుమతి కింద 20 వేల రూపాయలు రెండు మచిలీపట్నం కేకేఆర్ గౌతమ్ పాఠశాలల విద్యార్థులైన పి ఎస్ ఆర్ విశ్వనాథ్, ఆర్ ఈశానిలకు దక్కింది. మూడో బహుమతి కింద 15 వేల రూపాయలు కానూరు జడ్పీ హైస్కూల్, కోడూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులైన సబీహ, నాగ తనిషాలకు దక్కింది.

విజేతలైన విద్యార్థులకు మంత్రి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి వారిని అభినందించారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు అందరికీ కూడా పాల్గొన్నట్లు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి తహేరా సుల్తానా కళాశాల ప్రిన్సిపాల్, ఎర్నెస్ట్, సర్వ శిక్ష ఎపిసి శ్రీరాముల నాయక్ , ఏడి మనోహర్ నాయక్ డిప్యూటీ ఈవో పద్మారాణి సైన్స్ అధికారి జాకీర్ హుస్సేన్, తదితర విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ లు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా -ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *