అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ (DAY-NULM) మార్గదర్శకాల ప్రకారం మరియు మిషన్ డైరెక్టర్ యన్ . తేజ్ భరత్ , I . A.S. ఆదేశాల మేరకు రాస్ట్రంలో అన్నీ పట్టణాలలో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ (C-LAP) రూపొందించి పట్టణంలోని పేద ప్రజలందరికీ వారి సామర్ధ్యం మరియు నైపుణ్యం ఆధారంగా జీవనోపాధిని కల్పించి తద్వారా అన్ని కుటుంబాల తలసరి ఆదాయం పెంచుటకు మునిసిపాలిటిల సమన్వయముతో కృషి చేస్తున్నది.
దీనిలో భాగంగా శ్రీకాకుళం, రాజమండ్రి,ప్రకాశం,గుంటూర్, కాకినాడ, కడప,విజయ నగరం , విజయవాడ, కర్నూల్ అనంతపురం,విశాఖపట్నం,మచిలీపట్నం,తిరుపతి,, నెలూరు, చిత్తూర్ మంగళగిరి మునిసిపాలిటిలో 28.01.2025 నుండి 05.02.2025 వరకు మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిటీ లైవిలిహుడ్ టాస్క్-ఫోర్సు కమిటీ సభ్యులు మరియుజ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME (ni-msme) వారి ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాలకు సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ (C-LAP) రూపొందించుటకు సమావేశమయినారు.
మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (MEPMA) ఆధ్వర్యంలో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ (C-LAP) రూపొందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME (ni-msme) తో భాగస్వామ్యం కలిగి ప్రత్యేక కార్యక్రమం అన్ని మునిసిపాలిటీలలో ప్రారంభించడమైనది.
ఈ కార్యక్రమం ద్వారా పట్టణ పేదలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహం అందించడమే కాకుండా వారి సామర్థ్యాలను పెంచి స్వయం ఉపాధికి వీలుకల్పించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయబడతాయి.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
-పట్టణంలోని జీవనోపాధుల కల్పనకు సంబంధించిన అన్ని శాఖలు, పరిశ్రమలు, అధికారులు, స్వచ్చంద సంస్థలు స్వయం సహాయక సంఘ సభ్యులతో సిటీ లైవిలిహుడ్ టాస్క్-ఫోర్సు (CLTF) కమిటీని ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీ ఆధ్వరంలో రాబోయే ఐదు సంవత్సరాలకు పట్టణంలోని నిస్సహాయులు, పేదలు అందరికీ సుస్థిర జీవనోపాధులు కల్పించు అవకాశాలు, అవసరమైన సమన్వయము, అవసరమైన కార్యక్రమాలతో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించబడుతుంది.
-ni-msmeభాగస్వామ్యంతో లైన్-డిపార్టుమెంటు సిబ్బందికి, CLTF కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
-దీనిద్వారా ఉద్యోగ అవకాశాల విస్తరణ మరియు స్వయం ఉపాధి అవకాశాల కల్పన.
-పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే విధంగా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతి మునిసిపాలిటీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా పట్టణ పేదరికాన్ని తగ్గించేందుకు పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతుంది.
ఇది నగరాల్లో స్థిరమైన అభివృద్ధికి మార్గం వేస్తుంది మరియు మెరుగైన జీవనోపాధిని అందించేందుకు దోహదపడుతుంది.
Prajavartha Online Telugu News