Breaking News

2వ తేదీన పుంగనూరు నియోజక వర్గంలో ’జనంలోకి జనసేన’ బహిరంగ సభ

-ముఖ్య అతిథిగా హాజరు కానున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“జనంలోకి జనసేన” కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాన్ ప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా నాయకులు, పుంగనూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *