విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కరం కోసం మంగళవారం జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, శాసనసభ్యులు వల్లభనేని వంశీ సంబంధిత నిర్వాసితులతో సమావేశం అయ్యారు. మంగళవారం స్థానిక జెసి క్యాంప్ కార్యాలయంలో గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల పునరావాస కార్యక్రమలపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా చినఆవుటపల్లిలో 423 కుటుంబాలకు సంబంధించి 49 ఎకరాల లేఅవుట్లో సంబంధించిన అంశాలను నిర్వాసితులతో సమీక్షించారు. లేఅవుల్లో ఎవిధమైన మౌలిక సదుపాయలు కల్పించాలనే అంశంపై చర్చించారు. ఎస్సీ, బిసి, ఓసి కులాల వారిగా లేఅవుట్లో ఇళ్ల కేటాయింపు చేయాలని అవిధంగా లేఅవుల్లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జెసి సంబంధిత అధికారులను ఆదేశించారు. వారంలోపు లాటరీ ద్వారా నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేయాలన్నారు. అదేవిధంగా మూడు ప్రైవేట్ వెంచర్లకు సంబంధించి 562 ఫ్లాట్లుకు సంబంధించి 59 ఎకరాల్లో లేఅవుట్ సంబంధించిన అంశంపై సంబంధిత యూనియన్ ప్రతినిధులతో చర్చించారు. ఇందుకు సంబంధించిన దాక్యుమెంట్లను తదితర పత్రాలను అందజేయాలని సూచించారు. అదేవిధంగా రైతులకు చెల్లించవలసిన కౌలు సొమ్ము, ఇళ్లు కోల్పోయిన వారి భవనాల విలువ సొమ్ము చెల్లింపులు వారం రోజుల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జెసి మాధవీలత ఆదేశించారు. సమావేశంలో నూజివీడు ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …