-శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామలో కేంద్రీయ విద్యాలయం మంజూరుకు అవసరమైన స్థలం, ఇతర మౌలిక వసతుల విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహనరావు జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ డిఇఓ తహిరసుల్తాన తదితరులు పాల్గొన్నారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నదే తన అభిలాష అని శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహరావు అన్నారు. నందిగామలో ఇప్పటికే 5 ఎకరాల స్థలాన్ని కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధిత విద్యాశాఖ ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. దీనిపై భూమి విషయానికి సంబంధించి వారు కోరిన వివరణలకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ జె. నివాస్ స్పందిస్తూ ఈ విషయంపై సానుకూలమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు సదరు భూమి విషయం పై తహాశీల్దార్, మున్సిపల్ కమీషనర్ అవసరమైన చర్యలు తీసుకోవలన్నారు.