Breaking News

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు సమీక్ష

-న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిన సీఎం
-కూచిపూడి థీమ్ తో టెర్మినల్ డిజైన్లు ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను కోరారు. కూచిపూడి థీమ్ తో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న డిజైన్లు అంత ఆకర్షణీయంగా లేవని…నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిభింబించేలా ఉండాలని సిఎం సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి బిసి జనార్థన్ రెడ్డి, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పౌర విమానయాన అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును, ప్రోగ్రెస్ ను వివరించారు. రూ.611 కోట్లతో జరుగుతున్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి 58.50 శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. అదే విధంగా రూ.85 కోట్లతో నిర్మిస్తున్న ఎటిసి టవర్ పనులు 52 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న డిజైన్లపై చర్చ జరిగింది. డిజైన్లు మార్చాలని, రాష్ట్ర సంస్కృతి ప్రతిభింబించాలని సిఎం అన్నారు. మన సంస్కృతి ప్రతిభింబించేలా ఇంటీరియర్ డిజైన్లు ఉండాలని సిఎం సూచించారు. మన హస్తకళల ప్రతి రూపాలు ఇంటీరియర్ వర్కుల్లో కనిపించాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 చోట్ల ఎయిర్ స్ట్రిప్ లు అందబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నామని సిఎం పౌర విమాన యాన శాఖ అధికారులకు తెలిపారు. మూలపేట, కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెంతో పాటు అనంతపురం- తాడిపత్రి మధ్యలో ఒక ఎయిర్ స్ట్రిప్ తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని సిఎం తెలిపారు. ఎయిర్ కనెక్టివిటీ పెంచి ఎకనమిక్ యాక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని సిఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు, నిర్ణయాలకు పౌరవిమానయాన శాఖ సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *