Breaking News

Tag Archives: amaravathi

వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం

-అందుబాటులో 30 మంది డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది -అంటురోగాలు రాకుండా అన్ని చర్యలు చేపట్టాం -క్లోరినేషన్, నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నాం. -కమిషనర్ ఎన్.మౌర్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుఫాన్ ప్రభావంతో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని, అందరూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్లు గురించి మంగళవారం కమిషనర్ ఎన్.మౌర్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ప్రజాదర్బార్ కు విన్నపాలు వెల్లువెత్తాయి

-అల్లూరు పార్టీ కార్యాలయంలో వినతిపత్రాలు స్వీకరణ -తంగిరాల సౌమ్య చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన -సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం, అల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం వీరులపాడు మండలం అల్లూరు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి నుంచి సౌమ్య వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓప్పిగా విన్న ఆమె వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ …

Read More »

పల్లె పండుగ తో ప్రగతి పరుగులు

-ఊరూరా.. వేడుకగా పల్లె పండుగ -గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు (మం) (జుజ్జూరు/అల్లూరు), నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన పల్లెపండుగ కార్యక్రమం గ్రామగ్రామాన వేడుకగా జరిగింది. వీరులపాడు మండలంలోని జుజ్జూరు, అల్లూరు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కింద …

Read More »

తుపాను ప్ర‌భావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తం

-జిల్లాల్లో 24 గంట‌లూ ఎపిడెమిక్ సెల్ లు ప‌నిచేస్తాయి -రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబ‌రు 9032384168తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి -జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల‌కు ఆదేశాలు -ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి వెల్ల‌డి అమ‌రాతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మైన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి వాయుగుండంగా బ‌ల‌ప‌డే అవ‌కాశ‌మున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మ‌య్యింద‌ని ప్ర‌జారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె.ప‌ద్మావ‌తి నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల్లో భారీ నుంచి అతి …

Read More »

వరద నిర్వహణ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు

-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో సంభవించే ఆకశ్మిక వరదలను ధీటుగా ఎదుర్కొనేందుకు జలవనరులు , రెవిన్యూ శాఖల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకశ్మికంగా సంభవించే వరదల వల్ల ఎటు వంటి …

Read More »

ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. …

Read More »

శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ

-కఠిన చర్యలతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష …

Read More »

ఏటా 15 శాతానికి మించి వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ ప్లాన్:సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర @2047 కింద ఏటా 15 శాతానికి మించి వృద్ధి రేటు సాధించే విధంగా జిల్లా,మండల స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల కార్యదర్శులు,జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు.స్వర్ణాంధ్ర @2047లో భాగంగా 2024-2029 ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రతి శాఖ ద్వారా ఏటా 15 శాతం కంటే అధిక వృద్ధి రేటు సాధనకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని …

Read More »

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు

-స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ నినాదాన్ని ఆవిష్కరించేలా కొత్త పాలసీలు -అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ -ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -సచివాలయంలో ఇండస్ట్రియల్ డవల్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష..వచ్చే క్యాబినెట్ ముందుకు కొత్త పాలసీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

సీఎం సహాయ నిధికి దాతల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి దాతలు విరాళాలు అందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో రూ.30 లక్షలు 85 వేలు. 2. తుళ్లూరు గ్రామ రైతులు రూ.8 లక్షలు 3. విజయ్ కుమార్ రూ.6 లక్షలు 4. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రూ.3 లక్షల 11 వేల 116 …

Read More »