Breaking News

Tag Archives: amaravathi

కోతలు లేకుండా వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా

-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు డిస్కంల సీఎండీలు పృథ్వితేజ, శివశంకర్, పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ లు హాజరయ్యారు. సమీక్ష …

Read More »

భార‌త్ ఏఐలో విశాఖ గూగుల్ క్లౌడ్ ఇండియా స్వ‌ర్ణ‌యుగం

– మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేసే గూగుల్ ఏఐ డేటా సెంట‌ర్ భారతదేశ డిజిటల్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిల‌వ‌బోతోంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ శంకుస్థాప‌న చేస్తోన్న నేప‌థ్యంలో మంత్రి కొండ‌ప‌ల్లి దీనిని …

Read More »

ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైనట్లు పేర్కొన్నారు. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం (28-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 21 మండలాల్లో …

Read More »

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదు

-రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు ప్రారంభం

-“బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్” విధానంలో రూ. వెయ్యి కోట్లు జమ చేసేలా ప్రభుత్వ నిర్ణయం -ప్రత్యేక పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 323 ఆసుపత్రుల యాజమాన్యాల దరఖాస్తులు -ఒప్పందాలకు అనుగుణంగా 25 అస్పత్రులకు రూ. 62 కోట్లు చెల్లిoపు -మంత్రి సత్యకుమార్ యాదవ్ కి నివేదిoచిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు రూ.1,000 కోట్ల బకాయిలను ‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్. అగ్రిమెంట్’ (టీబీడీఏ) విధానంలో చెల్లింపుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. …

Read More »

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

-ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోండి -వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దు -ఆయిల్ కంపెనీలు ఉన్నపళంగా పాలసీలు మార్చి ఇబ్బంది పెడితే ఎలా? -అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు సమస్య చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష

-ప్యానిక్ కొనుగోళ్లతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ -రాష్ట్రంలోని 4,510 బంకుల్లో 421 బంకులు సరఫరా లేక మూతపడినట్లు తెలిపిన అధికారులు -ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత …

Read More »

అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు

-గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు విశాఖ జిల్లాలో శంకుస్థాపన -15 బిలియన్ డాలర్ల పెట్టుబడి – 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు -ఈ నెల 28న తర్లువాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన -గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి – టెక్ కంపెనీల ఆసక్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన …

Read More »

శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు కు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , ఆలయ పాలకమండలి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి ఆహ్వానించారు. ఈనెల 27 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందించి స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. …

Read More »

వడగాల్పులు వీచే అవకాశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సోమవారం (27-04-26) 23 మండలాల్లో తీవ్ర, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు వడగాల్పులు వీచే మండలాలు(23) విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాలు; పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, …

Read More »