Breaking News

Tag Archives: amaravathi

కూట‌మి ప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేదు

-దేశంలో తొలిసారిగా విద్యుత్ చార్జీలను 13 పైసలు ట్రూ డౌన్ చేశాం -వైసీపీ పెంచిన ఛార్జీల‌పై వాళ్లే ధ‌ర్నాలు, అసెంబ్లీలో ప్ర‌శ్న‌లు -కూట‌మిపై దుష్ప్ర‌చారాల‌ను నేత‌లే తిప్పి కొట్టాలి -ఇంధ‌నశాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌ల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు …

Read More »

ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు

చిల్లకల్లు,  నేటి పత్రిక ప్రజావార్త : చిల్లకల్లు ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మరియు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ సెంటర్ వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) గారు, ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.సి.హెచ్ శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా …

Read More »

కేడీసీసీ బ్యాంక్ కేవలం బ్యాంకింగ్ సేవలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో ముందుంది…

చిల్లకల్లు,  నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ బ్యాంక్) చైర్మన్ నెట్టెం రఘురాం దూరదృష్టి నాయకత్వంలో బ్యాంక్ రైతు సేవలలోనే కాకుండా సామాజిక సేవలలో కూడా ముందంజలో నిలుస్తూ సమాజానికి ఆదర్శంగా మారుతోంది. రైతుల ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ ప్రగతి మరియు ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కేడీసీసీ బ్యాంక్, తన ఉత్తమ పనితీరుతో ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను సాధించడం ద్వారా తన ప్రతిష్టను మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు …

Read More »

‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025’ అవార్డు సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల్లో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025’ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన సందర్భంగా, ఈ విజయానికి కృషి చేసిన అధికార యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu ఈరోజు సాయంత్రం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతిలోని ఏపీ సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ‘డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మంత్రులు, …

Read More »

కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-శుక్రవారం పమిడిముక్కలలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం -‘మేడే’ సందర్భంగా కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి -గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ భరోసా లబ్దిదారులతో మాట్లాడనున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల …

Read More »

రీసెర్చ్ సెంటర్లుగా యూనివర్సిటీలు

-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు -టెక్నాలజీ కాంపిటెన్సీ వచ్చేలా విద్యార్ధులకు శిక్షణ -రాష్ట్ర యువతకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ నైపుణ్యాలు -ఉద్యోగాల కల్పనపై సమీకృత పోర్టల్ ద్వారా సమాచారం -పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష -ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలు తెస్తున్నామన్న మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా వివిధ కోర్సులు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం …

Read More »

ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అధ్యయనం!

-ప్రస్తుత మందుల వినియోగ జాబితాలపై పునఃపరిశీలన -వైద్యులు, ఫార్మసిస్టుల మధ్య సమన్వయం పెరగాలి -అసుపత్రుల్లో రెగ్యులర్ మందులకు కొరత లేదు -త్వరలో మరో 380 రకాల మందులు అసుపత్రులకు సరఫరా చేస్తాo -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రులకు జరిగే మందుల సరఫరా వ్యవస్థలో సమూల మార్పులను తెస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మందుల కొనుగోళ్లు, అసుపత్రులకు పంపిణీ, రోగులకు …

Read More »

రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన సాధించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 20 లక్షల కు పైగా ఉద్యోగ కల్పన లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రుల బృందం పిలుపునిచ్చింది. ఏపి సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఇన్వేస్ట్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ పై గురువారం మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది ఈ సందర్భంగా మంత్రులు. కందుల దుర్గేష్,టి.జి.భరత్, గొట్టిపాటి రవి కుమార్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఈ సమీక్షలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20లక్షలకు పైగా ఉద్యోగ కల్పనపై …

Read More »

హైదరాబాద్, బెంగళూరు నుండి వెళ్లే హజ్ యాత్రికులకు పకడ్బందీగా ఏర్పాట్లు

-అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -హజ్ యాత్రికులకు ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష -ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి ఫరూక్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్-2026 యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన హజ్ యాత్రికులకు హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు, వసతులు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.మే 4 వ తేదీ నుండి హజ్ యాత్రకు హైదరాబాద్ …

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1385 వ (48వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు మరియు శాసన సభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ మీడియాకు వివరించారు… హోం శాఖ 1. హోం శాఖ: AP స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 2000 బ్యాచ్ కానిస్టేబుళ్ళను హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి కల్పించడానికి 385 …

Read More »