Breaking News

Tag Archives: Eluru

యువతను పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని మై భారత్ ఆహ్వానం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా యువతను MY భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి చురుకుగా సమీకరిస్తోంది. ఈ దేశవ్యాప్త పిలుపు, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభసమయాల్లో జాతీయ ప్రయోజనంలో కీలక పాత్రలు పోషించడానికి యువ పౌరులను శక్తివంతం చేయడానికి ఒక సమిష్టి ప్రయత్నంలో భాగం. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఇతర ఊహించని పరిస్థితులలో పౌర పరిపాలనను పూర్తి చేయగల సుశిక్షితులైన, …

Read More »

పర్యాటకులపై కాల్పులు అత్యంత హేయమైన చర్య..

-బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర మంత్రి పార్ధసారధి.. ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్, పహల్గామ్, అనంత్‌నాగ్‌లలో అమాయక పర్యాటకులు, స్థానికులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్రంగా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న, అనేక మందిని గాయపరిచిన సంఘటన అనాగరిక చర్య అన్నారు. మానవత్వం, శాంతి, కాశ్మీర్ ఆతిథ్య స్ఫూర్తిపై దాడిగా ఆయన పేర్కొన్నారు. బాధితుల …

Read More »

నియోజకవర్గాలలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయాలి

-వేసవికి త్రాగునీటి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి -జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిదినాలు మరింతగా పెంచాలి -సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణనలోనికి తీసుకోవాలి-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ -ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఇసుక స్టాక్ పాయింట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర …

Read More »

ముఖ్యమంత్రి రాకకోసం అగిరిపల్లి ప్రజలు సంతోషంతో ఎదురుచూస్తున్నారు

-ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి- రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి రాకకోసం అగిరిపల్లి ప్రజలు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లిలో ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక మార్కెట్ యార్డ్ లో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి . …

Read More »

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు

-ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆగిరిపల్లి /ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబాబునాయుడు ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఆగిరిపల్లిలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, …

Read More »

జీబిఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు..

-జీబిఎస్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జీబిఎస్ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మెడిసిన్స్, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్డియాలజీ, న్యూరాలజీ జనరల్ మెడిసిన్ విభాగాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు …

Read More »

ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసిఎంసి ఆమోదం తప్పనిసరి..

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నేపద్యంలో ఎలక్ట్రానికి మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) నుంచి ముందస్తు ఆమెదం పొందవలసివుంటుంది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లాఎంసిఎంసి కమిటీ ఆమోదం తెలపాల్సివుంటుంది. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వారు ఎంసిఎంసి కమిటీని నియమించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు …

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలి..

-తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజవకర్గ ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజవకర్గ ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలూరు కలెక్టరేట్ వి.సి. హాలునుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, తదితరులతో ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికలకు 43 మంది అభ్యర్ధుల నామినేషన్లు సక్రమం..

-నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఫిబ్రవరి 13.. ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : 1. పేరాబత్తుల రాజశేఖరం(తెలుగుదేశం), 2. కాట్రు నాగబాబు(తెలుగు నవగర్జన), 3. షేక్ హుస్సేన్(రిఫార్మ్ పార్టీ ఆఫి ఇండియా), 4. కట్టా వేణుగోపాలకృష్ణ(స్వతంత్ర అభ్యర్ధి), 5. డా. కవల నాగేశ్వరరావు(స్వతంత్ర అభ్యర్ధి), 6. కాండ్రేగుల నరసింహం(స్వతంత్ర అభ్యర్ధి),7. కాళ్లూరి కృష్ణమోహన్(స్వతంత్ర అభ్యర్ధి), 8. కుక్కుల గోవిందరాజు(స్వతంత్ర అభ్యర్ధి),9. కునుకు హేమాకుమారి(స్వతంత్ర అభ్యర్ధి), 10. కైలా లావణ్య(స్వతంత్ర అభ్యర్ధి)11. గద్దే విజయలక్ష్మి రాజపూడి(స్వతంత్ర అభ్యర్ధి), 12.గౌతం కొల్లు(స్వతంత్ర అభ్యర్ధి), 13. చక్రపాణి …

Read More »

ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయ రాకెట్ భగ్నం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు గుర్తించి భగ్నం చేశారు. నిందితుల ఒప్పుకోలు ఆధారంగా, మద్యం సరఫరా …

Read More »