ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నేపద్యంలో ఎలక్ట్రానికి మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) నుంచి ముందస్తు ఆమెదం పొందవలసివుంటుంది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లాఎంసిఎంసి కమిటీ ఆమోదం తెలపాల్సివుంటుంది. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వారు ఎంసిఎంసి కమిటీని నియమించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఈసి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఎంసిఎంసి మోనాటరింగ్ సెల్ ను ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది.
Tags Eluru
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News