Breaking News

Tag Archives: guntur

అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థని పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్నఅండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థని పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని, సుద్దపల్లి డొంక రోడ్ లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పని తీరు మెరుగయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ బస్టాండ్ ఎదురు నుండి ఉన్న యుజిడి లైన్ ను, సుద్దపల్లి డొంక రోడ్ లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అవుట్ ఫాల్ డ్రైన్ ను, …

Read More »

15 రోజుల్లో మెరుగైన పారిశుధ్యాన్ని నగరానికి అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్యం అధిక ప్రాధాన్యత కల్గిన అంశమని, శానిటేషన్ విధుల్లో ఉన్న అధికారులు, కార్మికులు సమన్వయంతో కృషి చేస్తూ 15 రోజుల్లో మెరుగైన పారిశుధ్యాన్ని నగరానికి అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగానికి సంబందించి శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణలో …

Read More »

ఆర్జీలను క్షేత్ర స్థాయి అధికారులు నేరుగా పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీలను క్షేత్ర స్థాయి అధికారులు నేరుగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, విభాగాధిపతులు పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగర …

Read More »

వెహికిల్ షెడ్ లో వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లో వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలని, మరమత్తులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కెవిపి కాలనీలోని వెహికిల్ షెడ్ ని ఆకస్మిక తనిఖీ చేసి, షెడ్ లోని వాహనాలు, ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నవి, మరమత్తులకు గురైనవి, కార్మికులు హాజరు తదితర వివరాలు ఏఈ, డిఈఈలను అడిగి సంబందిత రిజిస్టర్ లను పరిశీలించి తగు …

Read More »

అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు రూ.25 వేలు విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందులో భాగంగా తమ జీతం నుండి రూ.25 వేలు విరాళంగా అందిస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం శ్రేష్టమని, మనం విరాళం ఇచ్చే ప్రతి రూపాయి ఎంతో మంది పేదవారి ఆకలి తీర్చేందుకు దోహద పడుతుందని, కావున నగరపాలక సంస్థలో పని …

Read More »

గుంటూరు జిల్లా నూతన ఎస్పీ సతీష్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం సన్మానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ను ఆంధ్రప్రదేశ్ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం తరపున స్టేట్ జనరల్ సెక్రటరీ కాళహస్తి సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, కె.వి.నారాయణ డిఎస్పీ రిటైర్డ్, కోశాధికారి, బివి సుబ్బారెడ్డి డీఎస్పీ రిటైర్డ్, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సిబ్బందిలో సోదర భావం పెంపొందాలన్న ఉద్దేశంతో ఎస్పీ చేత …

Read More »

నగరాభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయండి

-రెండు వారాల్లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాలి -కార్పొరేషన్ కమిషనర్ తో పెమ్మసాని గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ‘నగరాభివృద్ధిపై పూర్తి దృష్టి సారించాలి. రోడ్ల ప్యాచ్ వర్క్ లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. కార్పొరేషన్ పై ఉన్న వ్యయభారం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.’ అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్  చెప్పారు. గుంటూరులోని స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసాని ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం కలిశారు. …

Read More »

రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యుద్దప్రాతిపదికన చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యుద్దప్రాతిపదికన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గోరంట్ల కొండమీద నిర్మాణపనులు నిలిచిన రిజర్వాయర్ ని పరిశీలించి సంబందిత అధికారులకు, కాంట్రాక్టర్ కు పనుల పురోగతిపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్రాజెక్ట్ వలన ఏ ప్రాంతాలకు, ఎంత మంది జనాభాకు …

Read More »

మార్కెట్ ల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రధాన మార్కెట్ ల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదని, ప్రజారోగ్యం దృష్ట్యా రోడ్ల మీద వ్యర్ధాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ నందివెలుగు రోడ్ విస్తరణ పనులను, బాలాజీ నగర్, కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్, రైతు బజార్, ఆనంద పేట తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్ ల్లోని గార్బేజ్ డంపింగ్ పాయింట్స్ …

Read More »

ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్ కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పల్నాడు బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్ఏ గల్లా మాధవిలతో కలిసి కలెక్టర్ పునః ప్రారంభించారు. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ తో కలిసి నల్లచెరువు మెయిన్ …

Read More »