Breaking News

Tag Archives: machilipatnam

వ్యవసాయ , ఆక్వా రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ, ఆక్వా రంగాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టరు పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా అధ్యక్షులు జన్ను రాఘవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించి , అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం …

Read More »

గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన చేసి త్వరితగతిన లక్ష్యాన్ని అధిగమించాలని.. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జరిగిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాలు, గడప గడపకు మన …

Read More »

రీ సర్వే, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి… : రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారులకు భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో అమరావతి నుండి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా కృష్ణాజిల్లా …

Read More »

గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి !!

-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం ‘గ్రామదర్శిని’ అమలు చేస్తుందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ స్పందన హాల్లో గ్రామదర్శిని ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారులు పలు గ్రామాలను సందర్శించడం అభినందనీయమన్నారు.”గ్రామదర్శిని”కార్యకమం ప్రకారం, వివిధ శాఖలకు చెందిన 100 మంది అధికారులు ప్రతి …

Read More »

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న యువ జంటలు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కులాంతర వివాహం చేసుకున్న జంటకు అందజేసే ప్రోత్సాహకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచింది. కృష్ణా జిల్లా పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కు చెందిన 140 మంది జంటలు వివాహాలు చేసుకుని ప్రోత్సాహకం కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకోగా.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డబ్బుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 20 మంది జంటలు, గన్నవరం నియోజవర్గంలో 15 మంది జంటలు, గుడివాడ …

Read More »

కృష్ణాజిల్లాలో 140 మంది జంటలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున 1 కోటి 24 లక్షల 95 వేల రూపాయల జమ !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కృష్ణాజిల్లాలో 140 మంది జంటలకు 1 కోటి 24 లక్షల 95 వేల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమే కాబడినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. వైఎస్సార్‌ కళ్యాణ మస్తు వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి …

Read More »

డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే, మిగిలిన దశల పనులు చురుగ్గా పూర్తి !!

-భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. సాయి ప్రసాద్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే, మిగిలిన దశల పనులు చురుగ్గా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భూపరిపాలన ప్రధాన కమీషనర్ ( సి సి ఎల్ ఏ) జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం రీసర్వే పురోగతి , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరుకు చర్యలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలలో ఇప్పటి …

Read More »

బాల కార్మికుల నిర్మూలన అనే అంశంపై శిక్షణ తరగతులు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IMJ -NGO) సంయుక్త ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మికుల నిర్మూలన అనే అంశంపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి అరుణ సారిక గారు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి …

Read More »

మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేలా వైద్య ఆరోగ్యశాఖ పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్‌సిహెచ్‌ నమోదు, మాతా శిశు మరణాలు, గర్బిణుల నమోదు, బాలింతలు గర్బిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపాలు …

Read More »

ఆధార్ సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ సేవల కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.అపరాజిత సింగ్ తో కలసి ప్రారంభించారు. అందిస్తున్న సేవలను కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొబైల్ నంబర్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ (వేలిముద్రల నవీకరణ), డాక్యుమెంట్ అప్డేట్ వంటి సేవల నిమిత్తం జిల్లాలో పలు చోట్ల ఆధార్ అప్డేట్ శిబిరాలను ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధార్ కార్డులోని …

Read More »