మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కులాంతర వివాహం చేసుకున్న జంటకు అందజేసే ప్రోత్సాహకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచింది.
కృష్ణా జిల్లా పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కు చెందిన 140 మంది జంటలు వివాహాలు చేసుకుని ప్రోత్సాహకం కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకోగా.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డబ్బుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 20 మంది జంటలు, గన్నవరం నియోజవర్గంలో 15 మంది జంటలు, గుడివాడ నియోజవర్గంలో 18 మంది జంటలు, మచిలీపట్నం నియోజవర్గంలో 15 మంది జంటలు, పామర్రు నియోజవర్గంలో 16 మంది జంటలు, పెడన నియోజవర్గంలో 26 మంది జంటలు, పెనమలూరు నియోజకవర్గంలో 30 మంది జంటలతో కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 140 మందికి ప్రభుత్వం 1 కోటి 24 లక్షల 95 వేల రూపాయలు విడుదల కావడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా అందుకున్న మూడు జంటలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తొలుత పమిడిముక్కల మండలం ఫతేలంక గ్రామానికి చెందిన ఆఫ్రీనా ఫాతిమా మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన తనకు షేక్ హుస్సేన్ తో వివాహమైందని, తండ్రి చనిపోవడంతో తన తల్లి సోదరుడు ఈ వివాహం జరిపించారని చెప్పింది. తన తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు షాదీతోఫా అందించి ఎంతో ఆర్థిక సహాయం చేశారని కృతజ్ఞతలు తెలిపింది.
మచిలీపట్నం ఉల్లిoగిపాలెంకి చెందిన నడకుదుటి పవన్ కుమార్ మాట్లాడుతూ, తాను జుజ్జువరపు మౌనికను కులాంతరవాహం చేసుకున్నట్లు తెలిపారు. కళ్యాణమస్తు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడంతో ఏదైనా ఉపాధి అవకాశం చూసుకోవడానికి మార్గం ఏర్పడిందని ఈ సహాయం చేసిన ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.
కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన పాతూరి రమ్య మాట్లాడుతూ, తన భర్త పేరు మన్నే సునీల్ అని గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన కులాంతర వివాహం చేసుకున్నట్లు చెప్పారు. కళ్యాణమస్తు ఆర్థిక సాయం తమకు ఎంతో చేదోడుగా ఉంటుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News