Breaking News

బాల కార్మికుల నిర్మూలన అనే అంశంపై శిక్షణ తరగతులు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (IMJ -NGO) సంయుక్త ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మికుల నిర్మూలన అనే అంశంపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి అరుణ సారిక గారు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మికుల నిర్మూలన కోసం అనేక చట్టాలు చేసినప్పటికీ వాటి గురించి ప్రజల్లో అవగాహన లేక ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వీటి గురించి అవగాహన కల్పించడం కోసం జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ వారు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీలలో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, పోలీస్ అధికారులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో ఏర్పాటుచేసి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మానవ అక్రమ రవాణా నివారణకు ఈ కమిటీలు కృషి చేస్తాయని అమాయకులైన పేద ప్రజలు వారి యొక్క అవసరాల కొరకు ఇటువంటి అక్రమ రవాణాకు గురికాకుండా ఉండుటకు వారిని చైతన్యవంతులు చేయడం కోసం ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటువంటి వారిని గుర్తించినప్పుడు న్యాయ సేవ అధికార సంస్థకు సమాచారం అందించినట్లయితే సత్వరమే స్పందించి వారికి ఉచిత న్యాయం సహాయం అందించి తగు చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.

దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సభ్యులు శ్రీమతి గ్రేస్ అశ్విన్ క్రిస్టోఫర్ మరియు రిసోర్స్ పర్సన్ శ్రీ విలియమ్స్ క్రిస్టోఫర్ గారు ఈ చట్టాల గురించి అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల శివరామకృష్ణ ప్రసాద్ గారు డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *