Breaking News

ఇ- వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) వలన భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం..

-ఉద్యమంగా ఇ- వేస్ట్‌ సేకరణ చేపట్టి కాలుష్యాన్ని నివారిద్దాం..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇ- వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) భవిష్యత్‌ పై తీవ్ర దుష్పృభావం చూపనున్నాయని స్వచ్చంద సంస్థలు సహకారంతో ఉద్యమమంగా ఇ-వేస్ట్‌ సేకరణ చేపట్టి కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
లయన్‌ ఇంటర్‌నేషనల్‌ డిస్టిక్‌ గవర్నర్‌ లయన్‌ దామర్ల శ్రీ శాంతి ఆధ్వర్యంలో జిల్లాలో 30 రోజుల పాటు నిర్వహిస్తున్న వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఇ-వేస్ట్‌ కలక్షన్‌ డ్రైవ్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్‌, లాప్‌ టాప్‌, ప్రింటర్‌, ఫాక్స్‌, సెల్‌ఫోన్‌, లాండ్‌ ఫోన్‌, ఛార్జర్‌, మైక్రోవేవ్‌, ఎలక్ట్రికల్‌ కుక్కర్‌, టీవి, డివీడి, రిమోట్‌, స్టీరియో టేప్‌ రికార్డర్‌, ఫాన్‌, వాటర్‌ హీటర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం నానాటికి పెరిగిపోతుందన్నారు. దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్‌ వినియోగించనిదే ఒక క్షణం కూడా గడవని పరిస్థితి ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులలో ఉండే లెడ్‌, కాడ్మియం, మెర్కూరీ బెరీలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవన్నారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ప్రజలు బహిరంగ ప్రదేశాలలో వ్యర్థ పదార్థాలతో కలిపి పారవేయడం వలన రసాయన పదార్థాలు భూమి నీరు గాలిలో కలవడం వలన అవి కాలుష్యతమవుతున్నాయన్నారు. తద్వారా ప్రజలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి కాన్సర్‌ గుండె ఊపిరితిత్తుల వంటి అనేక వ్యాధులకు గురి అవుతున్నారన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థ్థాలపై ప్రజలలో అవగాహన కల్పించి నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులను సేకరించి కాలుష్యరహిత జిల్లాగా తీర్చిదిద్దాడంలో స్వచ్చంద సంస్థల భాగస్వామ్యం అవసరమన్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాటిని ప్రత్యేకంగా సేకరించేందుకు కలక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్‌ రంగంలోని కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి ప్రోసెస్‌ చేస్తున్న విధానాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా అమలు చేసే విధంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్‌ అన్నారు.ప్రైవేట్‌ రంగంలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను విక్రయించే సంస్థలు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను రీబ్యాక్‌ చేసేలా చర్యలు తీసుకుంంటున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణను తప్పనిసరిగా అమలు పరచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సింగ్‌ నగర్‌ ప్రాంతంలో పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఇ-వేస్ట్‌, ఫ్లవర్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించు కోవడం జరిగిందని తద్వారా నగరంలో కాలుష్యం తగ్గి మోడల్‌ నగరంగా గుర్తింపు పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తునన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1000 టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి కాలుష్యనివారణలో భాగస్వామ్యులైన లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
లయన్‌ ఇంటర్‌నేషనల్‌ జిల్లా గవర్నర్‌ లయన్‌ దామర్ల శ్రీ శాంతి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విస్తరించిన లయన్‌ ఇంటర్‌నేషనల్‌ ఆధ్వర్యంలో లయన్స్‌ క్లబ్‌ల ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. జిల్లాలలో కృష్ణా ఎన్‌టిఆర్‌ జిల్లాలో 105 లయన్స్‌ క్లబ్‌ల ద్వారా 30 రోజుల పాటు ఇ-వేస్ట్‌ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా 1000 టన్నుల ఇ-వేస్ట్‌ ఎలక్ట్రానిక్‌ వ్యర్థపదార్థాలను సేకరించాలనే లక్ష్యంగా నిర్థరించుకున్నామన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న వ్యర్థాలను స్వచ్చందంగా అప్పగించేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.
తొలుత ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలతో బందర్‌ రోడ్డులో ర్యాలీని నిర్వహించి ఇందిరాగాంధీ స్టేడియం నందు వ్యర్థాల సేకరణను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రతినిధులు లయన్‌ పి. సుభాష్‌బాబు, అంబటి సుధాకర్‌రెడ్డి, కె. విజయ్‌చంద్‌, గద్దె శేషగిరి, మిరియల వెంకటేశ్వరరావు, మూల్పూరి ఉపేంద్ర, యం ప్రభాకర్‌రావు, కె. సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *