Tag Archives: rajamandri

తూర్పు గోదావరి జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బుడ్డెపు నగేష్ బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బడ్డెపు నగేష్ బుధవారం రాజమహేంద్రవరం వైటిసి ఆవరణలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపిడి) వై సత్యం నాయుడు, పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బుడ్డెపు నగేష్ సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా సహకార శాఖలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ రిజిస్ట్రార్ / ఫ్యాకల్టీగా రాందాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్, రాజమండ్రిలో …

Read More »

నల్సా వారి పథకం కింద న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన అవసరం – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బుధవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బొమ్మూరు గ్రామ పంచాయతి కార్యాలయంలో “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం–2024” కింద బాల్యవివాహాల నివారణ, పోక్సో చట్టం–2012, ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వం అంశాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు …

Read More »

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాను 29-01-2026 (గురువారం) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 10.00 గంటల నుండి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డౌలేశ్వరం నందు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగ మేళాలో ఎనర్జీ, వేర్‌హౌసింగ్, అగ్రో ఇండస్ట్రీ, రైల్వే సపోర్ట్ సర్వీసులు, ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలకు …

Read More »

AP టూరిజం రీజినల్ డైరెక్టర్ (రాజమహేంద్రవరం) మరియు APTDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులకు ఎన్.వి.వి.ఎస్. మూర్తి నియామకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సంస్కృతి (పర్యాటక) శాఖ జారీ చేసిన G.O.Rt.No.6, తేది: 06.01.2026 ప్రకారం, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా DRDA, SERP ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.వి.వి.ఎస్. మూర్తిని, అన్య శాఖల (forigne services) నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఒక సంవత్సరం పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన, రీజినల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ, రాజమహేంద్రవరం రీజియన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP TDC), …

Read More »

జిల్లాలో “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాల ప్రారంభం

-వివక్షతకు తావులేకుండా కుష్టు వ్యాధిగ్రస్తులను ఆదరించాలి -జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కుష్టు నివారణ పక్షోత్సవాలు ఈ ఏడాది *“స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం (SLAC)”*గా జనవరి 30, 2026 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనీ …

Read More »

జనవరి 22న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22వ తేదీ (గురువారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ షాడో ఫేక్స్ వెర్ హౌస్, …

Read More »

రేపటిలోగా (జనవరి 21) శాఖల వారీ పనుల జాబితా, అంచనాలకు తుది రూపం అందించాలి

-గోదావరి పుష్కరాల సన్నాహక సమీక్షలో ఇంచార్జి జిల్లా కలెక్టర్, కమిషనర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈలోగా అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా, అంచనాలకు తుది రూపం దిద్దాల్సిన అవసరం ఉందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరగాలంటే, అందుకు …

Read More »

జనవరి 28 న పిడిఎస్ బియ్యం బహిరంగ వేలం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం–1955 కింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణీ (PDS) బియ్యంను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. మేఘా స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం జనవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) కార్యాలయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు జనవరి 27న …

Read More »

జిల్లా కోర్టు పరిధిలో మూడు కేటగిరీలకు చెందిన పోస్టుల భర్తీకి నోటిఫీకేషన్ జారీ

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్–III, కేటగిరీ–3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు భర్తీ (రాత పరీక్ష : 08-02-2026 | నైపుణ్య పరీక్ష : 12-02-2026) డివిజన్–III లోని కేటగిరీ–3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీలో 01 ఖాళీ ఉండగా, వేతన శ్రేణి రూ.28,280/- నుండి రూ.89,720/- వరకు ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం కలిగి …

Read More »

భోగి–సంక్రాంతి–కనుమ పండుగ మూడు రోజులూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

-ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రత్యేక డ్రైవ్ – కారు, ఆటో, ద్విచక్ర వాహనదారులకు సూచనలు -హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణ లో నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం -జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 (National Road Safety Month–2026) కార్యక్రమాల్లో భాగంగా, భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత స్థాయిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. …

Read More »