-డి ఎస్ వో – వి. పార్వతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న కొవ్వూరు డివిజన్‌కు చెందిన 1734.32 క్వింటాళ్లు, రాజమహేంద్రవరం డివిజన్‌కు చెందిన 1601.51 క్వింటాళ్లు కలిపి మొత్తం 3335.83 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యానికి సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాయింట్ కలెక్టర్ మరియు కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. …
Read More »Tag Archives: rajamandri
జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఘన సన్మానం
-ఎస్సీల సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా సమిష్టిగా కృషి చేయాలి -కె.ఎస్. జవహర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ని జిల్లా అధికారులు, ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ, ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ఉద్యోగ …
Read More »షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష
-వివక్షకు తావులేకుండా అర్హులకు పథకాలు అందాలి -ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ రాజమహేంద్రవరం (కలెక్టరేట్), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రయోజనాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కే.ఎస్.జవహర్ మాట్లాడుతూ గతంలో తాను ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అమలు చేయడమే …
Read More »తూర్పు గోదావరి జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బుడ్డెపు నగేష్ బాధ్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బడ్డెపు నగేష్ బుధవారం రాజమహేంద్రవరం వైటిసి ఆవరణలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపిడి) వై సత్యం నాయుడు, పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బుడ్డెపు నగేష్ సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా సహకార శాఖలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ రిజిస్ట్రార్ / ఫ్యాకల్టీగా రాందాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్, రాజమండ్రిలో …
Read More »నల్సా వారి పథకం కింద న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన అవసరం – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బుధవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బొమ్మూరు గ్రామ పంచాయతి కార్యాలయంలో “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం–2024” కింద బాల్యవివాహాల నివారణ, పోక్సో చట్టం–2012, ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వం అంశాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు …
Read More »రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాను 29-01-2026 (గురువారం) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 10.00 గంటల నుండి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డౌలేశ్వరం నందు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగ మేళాలో ఎనర్జీ, వేర్‌హౌసింగ్, అగ్రో ఇండస్ట్రీ, రైల్వే సపోర్ట్ సర్వీసులు, ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలకు …
Read More »AP టూరిజం రీజినల్ డైరెక్టర్ (రాజమహేంద్రవరం) మరియు APTDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులకు ఎన్.వి.వి.ఎస్. మూర్తి నియామకం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సంస్కృతి (పర్యాటక) శాఖ జారీ చేసిన G.O.Rt.No.6, తేది: 06.01.2026 ప్రకారం, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా DRDA, SERP ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.వి.వి.ఎస్. మూర్తిని, అన్య శాఖల (forigne services) నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఒక సంవత్సరం పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన, రీజినల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ, రాజమహేంద్రవరం రీజియన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP TDC), …
Read More »జిల్లాలో “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాల ప్రారంభం
-వివక్షతకు తావులేకుండా కుష్టు వ్యాధిగ్రస్తులను ఆదరించాలి -జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కుష్టు నివారణ పక్షోత్సవాలు ఈ ఏడాది *“స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం (SLAC)”*గా జనవరి 30, 2026 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనీ …
Read More »జనవరి 22న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా
-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22వ తేదీ (గురువారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలొ షాడో ఫేక్స్ వెర్ హౌస్, …
Read More »రేపటిలోగా (జనవరి 21) శాఖల వారీ పనుల జాబితా, అంచనాలకు తుది రూపం అందించాలి
-గోదావరి పుష్కరాల సన్నాహక సమీక్షలో ఇంచార్జి జిల్లా కలెక్టర్, కమిషనర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈలోగా అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా, అంచనాలకు తుది రూపం దిద్దాల్సిన అవసరం ఉందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరగాలంటే, అందుకు …
Read More »
Prajavartha Online Telugu News