Breaking News

Tag Archives: rajamandri

జనవరి 28 న పిడిఎస్ బియ్యం బహిరంగ వేలం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం–1955 కింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న 3335.8286 క్వింటాళ్ల ప్రజా పంపిణీ (PDS) బియ్యంను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) వై. మేఘా స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం జనవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) కార్యాలయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు జనవరి 27న …

Read More »

జిల్లా కోర్టు పరిధిలో మూడు కేటగిరీలకు చెందిన పోస్టుల భర్తీకి నోటిఫీకేషన్ జారీ

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్–III, కేటగిరీ–3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు భర్తీ (రాత పరీక్ష : 08-02-2026 | నైపుణ్య పరీక్ష : 12-02-2026) డివిజన్–III లోని కేటగిరీ–3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీలో 01 ఖాళీ ఉండగా, వేతన శ్రేణి రూ.28,280/- నుండి రూ.89,720/- వరకు ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం కలిగి …

Read More »

భోగి–సంక్రాంతి–కనుమ పండుగ మూడు రోజులూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

-ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రత్యేక డ్రైవ్ – కారు, ఆటో, ద్విచక్ర వాహనదారులకు సూచనలు -హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణ లో నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం -జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 (National Road Safety Month–2026) కార్యక్రమాల్లో భాగంగా, భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత స్థాయిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. …

Read More »

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా, గురువారం బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ ను సందర్శించడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)- 2026 కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆటో రిక్షా వాహనదారులకు అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడం నిషేధం అనీ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది, దీనితో పాటుగా ఆటో రిక్షా వాహనదారులకు సంభందిత వాహన పత్రాలు (పర్మిట్ / ఫిట్నెస్ లైసెన్సు / ఇన్షూరెన్స్ ) తప్పనిసరిగా …

Read More »

ఇసుక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి – మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన ఆదేశాలు

-కలెక్టరేట్‌లో మైన్స్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం మంత్రి కొల్లు రవీంద్ర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని, అయినప్పటికీ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని , వాటిని గుర్తించి సమర్థవంతంగా అధిగమించాలని ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడం పై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ …

Read More »

ఖరీఫ్‌లో లక్ష్యానికి చేరువగా వరి సేకరణ

– జేసి వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్‌ 2025–26 సీజన్‌లో తూర్పు గోదావరి జిల్లాలో వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు గాను తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి అంచనా వేయగా, జనవరి 1, 2026 నాటికి 3,67,852.240 మెట్రిక్‌ టన్నుల వరిని పిపిసిల ద్వారా సేకరించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు …

Read More »

నేటి నుంచి ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిటివో ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి

-సబ్ ట్రెజరీ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు తరలి వచ్చిన ప్రభుత్వ పెన్షన్ దారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఖజానా మరియు లెక్కల సంచాలకులు, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల నుంచి వివిధ స్థాయిలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు తప్పనిసరిగా 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్) సమర్పించాల్సి ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనల వెల్లువ

-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గురువారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయం సమీపంలోని గ్రీన్ పార్క్ సిటీ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రజలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరారంభం …

Read More »

జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

-ఇసుక రవాణాలో అధిక లోడింగ్‌పై పర్యవేక్షణ పెంచాలి -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకుని (జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు) రహదారి భద్రతపై ప్రజలు, వాహనదారుల్లో విస్తృత అవగాహన కల్పించేలా క్షేత్ర స్థాయిలో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో “SADAK SURAKSHA ABHIYAN” పోస్టర్లు, గోడపత్రికలను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …

Read More »

నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి పలువురు శుభాకాంక్షలు

-ప్రభుత్వ పథకాలు–అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధత అవసరం -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపు కు స్పందించి నోట్ పుస్తకాలు , విద్యార్థులకి ఉపయోగ పడే పుస్తకాలు అందచేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు …

Read More »