– ప్రిన్సిపాల్ సి.హెచ్. సునీల్ కుమార్ ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఐ.టి.ఐ., ధవళేశ్వరం లో ప్రవేశం కొరకు నమోదు చేసుకుని, పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు జూలై 23 న నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోయిన అభ్యర్థులు మరియు హాజరైనప్పటికీ సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులు కోసం జూలై 25 వ తేది శుక్రవారం స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ సి.హెచ్. సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. కావున ఈ …
Read More »Tag Archives: rajamandri
సమాచార హక్కు చట్టంపై సహకార శాఖ ఉద్యోగులకి అవగాహన కార్యక్రమం
-ఎమ్ వెంకట రమణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార సంస్థలు ప్రజలకు అత్యంత దగ్గరగా పనిచేసే శక్తివంతమైన సంస్థలని, సమాచారం హక్కు చట్టం (2005) అమలులో సహకార శాఖ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తూర్పు గోదావరి జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 పై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో MSMEల బలోపేతానికి ర్యాంప్ (RAMP) పథకం
-ఉద్యోగావకాశాలు – స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మద్దతుతో అమలు చేస్తున్న RAMP (Raising and Accelerating MSME Performance) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాల మేరకు కార్యాచరణ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం …
Read More »సీఎం హామీ అమలు – దివ్యాంగుల పింఛన్లు ఆరోగ్య పింఛన్లుగా మార్పు
-ఆగస్టు 1 వ తేదీ పెన్షన్ పంపిణీ చెయ్యడం జరుగుతుంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం / తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ… ” అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయడమే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాకొవ్వూరు నియోజక వర్గానికి చెందిన కోవూరు, తాళ్లపూడి మండలాలకి చెందిన …
Read More »వాట్సాప్ ద్వారా నగర సమస్యలకు పరిష్కారం
-అందుబాటులో వాట్సాప్ నెంబరు: 98666 57600 -జిల్లా కలెక్టర్ (ఆర్ ఎం సి కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలు) పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగు నీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్, ధ్రువీకరణ పత్రాలు తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబరు 98666 57600 ను అందుబాటు లోనికి తీసుకుని రావడం జరిగిందనీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు నగర కమిషనర్ …
Read More »వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం
-అందుబాటులో వాట్సాప్ నెంబరు “98666 57600” -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర ప్రజలు, జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగు నీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యలు, ధ్రువీకరణ పత్రాల వంటి వివిధ సమస్యలను నేరుగా తెలియ చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబరు ” 98666 57600 ” ను అందుబాటులోకి తీసుకొ చ్చినట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి బుధవారం ఒక …
Read More »ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శన
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శించారు. ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారం లోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యుల తో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం …
Read More »సీఎం హామీల అమలు పర్యవేక్షణకు కలెక్టర్ ఆకస్మిక పరిశీలన
-మలకపల్లిలో పోసిబాబు, సుజాత కుటుంబాలను కలెక్టర్ పి ప్రశాంతి సందర్శన తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో సీఎం కాన్వాయ్‌లో ప్రయాణించిన కామన్ మ్యాన్ సనమండ్ర పోసిబాబు కుటుంబం, అలాగే “పీ-4” కార్యక్రమంలో పాల్గొన్న ములపర్తి సుజాత కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు పురోగతిని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి …
Read More »విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశం
-కరెంట్ కట్ లు, లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు -ఐదేళ్ల వైసీపీ హయాంలో విద్యుత్ శాఖ నిర్వీర్యం -అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లు -తూర్పు గోదావరి విద్యుత్ అధికారుల సమీక్షలో మంత్రి గొట్టిపాటి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తూర్పు …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ, సైనిక్ సంక్షేమ నిధికి డ్వామా నుంచి భారీ విరాళాలు
– కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 35,400 మంది ఉపాధి హామీ కూలీలు సాయుధ దళాల పతక దినోత్సవ నిధికి విరాళం ఇవ్వడం తూర్పు గోదావరి జిల్లాకే గర్వ కారణమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యత్వ నమోదు కోసం రూ.2.20 లక్షల చెక్కును, అలాగే సైనిక్ సంక్షేమ నిధికి ఉపాధి హామీ కూలీల తరపున సేకరించిన రూ.3.54 …
Read More »
Prajavartha Online Telugu News