Breaking News

Tag Archives: rajamendri

మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి శనివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నందు నిర్వహించిన మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం అని, భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యూష కుమారి తెలిపారు. ప్రతీ ఒక్కరు వారికి …

Read More »

రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం… : కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఈరోజు వరకు 39,41,101 పని దినాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల లో ఉన్న పేదవారికి, కొద్దిపాటి నైపుణ్యం కలిగిన వారికి పనులు కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధిహామీ పథకం అమలు చేయడం జరుగుతొందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కి 2022-23 సంవత్సరానికి 37 లక్షల ఉపాధి హామీ పని దినాలు కల్పించడం లక్ష్యం కాగా …

Read More »

డిసెంబర్ 15 న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ని డిసెంబర్ 15 వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, రెవెన్యూ, మండల స్థాయి అధికారులు తగిన రీతిన డిసెంబర్ 15 గురువారం అమరజీవి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠాశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తదితర ప్రాంతాల్లో నిర్వహించాలనీ కలెక్టర్ స్పష్టమైన ఉత్తర్వులు …

Read More »

తుఫాను నేపథ్యంలో రాబోవు రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించాలి…

-ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తుఫాను నేపథ్యంలో రాబోవు రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లాలో మండల, ఆర్ బి కే ప్రత్యేక అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ రైతులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పక్రియపై రెవెన్యూ, పౌరసఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. …

Read More »

ఇసుక ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు, మన బడి నాడు నేడు పనులను, లబ్దిదారుల గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ భవన నిర్మాణానికి, పేదల ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం ఇసుక ఇబ్బంది లేకుండా …

Read More »

ఒక్క ఆకలి చావు ఉండకూడదు అనే ఆశయంతో రాష్ట్ర ఆహార కమిషన్ పనిచేస్తోంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్క ఆకలి చావు ఉండకూడదు అనే ఆశయంతో రాష్ట్ర ఆహార కమిషన్ పనిచేస్తోందని, అధికారులు అవినీతి పాల్పడితే ఫుడ్ కమిషన్ తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, కమిషన్ సభ్యులు జే. కృష్ణ కిరణ్ లు  తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలో ప్రభుత్వ పాఠాశాలలు, …

Read More »

సరోగసి ఏఆర్టి క్లినిక్లను తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ బృందం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు వారి ఆధ్వర్యంలో స్థానిక విజయభారతి జస్ట్ ఇన్స్టిట్యూట్ అందుగల ART లెవెల్ 1 కేంద్రం మరియు దానవాయిపేట నందుగల లండన్ IVF కేంద్రం లను జిల్లా వైద్య అధికారుల తనిఖీ బృందం వారిచే తనిఖీ చేయడం జరిగినది. ఈ తనిఖీ బృందం DR. కె. వెంకటేశ్వరావు DMHO, డా. ప్రమీల, గైనాకాలజిస్ట్, డా. వి. రామచంద్ర, డా. నాషీరుద్దీన్ షేక్, పథలాజిస్ట్, అర్జున్, సోసియలాజిస్ట్, …

Read More »

జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలి…

-కలెక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 11542 మంది గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించి, రక్తహీనత (anemia) ఉన్నట్లు గుర్తించిన 3800 మందికి పౌష్టికాహారాన్ని అందించే దిశలో ఐసిడిఎస్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం వెలగపూడి నుంచి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి యం.టి. కృష్ణబాబు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలు జరుగుతున్న పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా …

Read More »

జిల్లా లో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నిర్వహించే డిపార్ట్ మెంట్ పరీక్షలు ప్రశాంత వాతావరణం లో సజావు గా జరిగే విధంగా చర్యలు తీసు కోవాలి…

-డిఆర్వో జి. నరసింహులు రాజమహేంద్ర వరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నిర్వహించే డిపార్ట్ మెంట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సమన్వయ అధికారి మరియు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు అధికారులకు సూచించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్ లో డిపార్ట్ మెంట్ పరీక్షలకు విధులు నిర్వహించే వివిధ శాఖల అధికారులతో ముందస్తు ఏర్పాట్లు డిఆర్వో జి. నరసింహాలు సమావేశం …

Read More »

పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా పారదర్శకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పక్రియపై , మండల తహసీల్దార్లు, పౌరసఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో ఆర్బీకే లు వారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సమీక్షిస్తూ జిల్లాలో రైతుకు అవసరమైన గన్ని బాగ్స్ ఒక రోజు ముందుగానే సిద్దం చేసుకొని …

Read More »