Breaking News

సరోగసి ఏఆర్టి క్లినిక్లను తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ బృందం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు వారి ఆధ్వర్యంలో స్థానిక విజయభారతి జస్ట్ ఇన్స్టిట్యూట్ అందుగల ART లెవెల్ 1 కేంద్రం మరియు దానవాయిపేట నందుగల లండన్ IVF కేంద్రం లను జిల్లా వైద్య అధికారుల తనిఖీ బృందం వారిచే తనిఖీ చేయడం జరిగినది. ఈ తనిఖీ బృందం DR. కె. వెంకటేశ్వరావు DMHO, డా. ప్రమీల, గైనాకాలజిస్ట్, డా. వి. రామచంద్ర, డా. నాషీరుద్దీన్ షేక్, పథలాజిస్ట్, అర్జున్, సోసియలాజిస్ట్, సభ్యులతో గల తనిఖీబృందం చే తనిఖీ చేయడమైనది. ఈ కార్యక్రమం లో డా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేషనల్ ART, సరోగసీ పోర్టల్ నందు అప్లై చేసుకున్న అప్లికేషన్ ద్వారా క్లినిక్ పరిసరాలు, పరికరాలు, ఇందులో అప్లై చేసుకున్న ఉద్యోగులు మరియు అక్కడ ప్రొసీజర్ వివరాలు పరిశీలించి వాటిని అడిగి తెలుసు కున్నారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వారి అనుమతితో తదుపరి రిజిస్ట్రేషన్ ను జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ వారి దృష్టికి తీసుకొని వెళ్తామని తెలియ చేసారు. ఈ కార్యక్రమములో డెమో సత్య కుమార్, ఎంపి హెచ్వో నాగు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *