-డిఆర్వో జి. నరసింహులు
రాజమహేంద్ర వరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నిర్వహించే డిపార్ట్ మెంట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సమన్వయ అధికారి మరియు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు అధికారులకు సూచించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్ లో డిపార్ట్ మెంట్ పరీక్షలకు విధులు నిర్వహించే వివిధ శాఖల అధికారులతో ముందస్తు ఏర్పాట్లు డిఆర్వో జి. నరసింహాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ లూథర్‌గిరి, రాజమహేంద్రవరం నందు ఈ నెల 9 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు డిపార్ట్ మెంట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉ. 9 గం. నుంచి ఉ. 11 గం.లవరకు తిరిగి మ.2 గం. నుంచి సా.4 గం.ల వరకు రెండు పూటల పరీక్షలు నిర్వహించడం జరుతుందన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో ఆయా కేంద్రాల వద్ద పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. కళాశాల పరిధిలో 144 సెక్షన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తాహిసీల్దార్ ను ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు, పరీక్షల సమయంలో విద్యుత్ కి విఘాతం కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపింగ్ జరిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమం లో తాహశీల్థారు అర్భన్ సుస్వాగతం, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ పివి నవజ్యోతి, ఎఎస్ఓ ఎ.నాగలక్ష్మి, కో ఆర్డినేషన్ సెషన్ సూపరింటెండెంట్, కే.రాజ్యాలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News