ఇసుక ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు, మన బడి నాడు నేడు పనులను, లబ్దిదారుల గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ భవన నిర్మాణానికి, పేదల ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం ఇసుక ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనుమతులు, కాల పరిమితి పూర్తి అయిన ర్యాంపుల్లో తవ్వకాలు జరగకుండా వాటిని మూసి వెయ్యాలని స్పష్టం చేశారు. గోదావరి నది వంతెన నుంచి 500 మీటర్ల దూరంలో ఎటువంటి ఇసుక త్రవ్వకాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇందుకోసం సెబీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

సీతానగరం మండలం లోని కాటవరం, మునికూడలి పరిధిలో గతంలో అక్రమ ఇసుక నిల్వ ను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పనుల నిమిత్తం ప్రభుత్వం నిర్దేశించిన నిర్బంధ రుసుము చెల్లింపు వసూలు చేసే క్రమంలో వినియోగించడం పై సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వీటిపై తదుపరి అనుమతుల కోసం సంబంధిత శాఖలకు సిఫార్సు చేసేలా ఆమోదించడం జరిగిందన్నారు. ఇసుక త్రవ్వకాలకు సంబంధించి వొచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, సంబందించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు . నవంబర్ 15 న జరిగిన సమావేశంలో వచ్చిన అంశాలపై , అనంతర చర్య పై సమీక్ష నిర్వహించారు. పూర్వపు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా లకు చెందిన రీచేస్ కొత్తగా ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా కి చెందిన 11 ర్యాంపుల విషయమై సమావేశం లో చర్చించి సంబంధిత శాఖల ద్వారా తగిన అనుమతుల కోసం సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. సీతానగరం పరిధిలో వంగలపూడి రెండు రీచేస్ ద్వారా 4.83 హెక్టర్ల లో 48,300 ఎంటి , 4.59 హెక్టార్ల లో 45,900 ఏంటి ఇసుక వినియోగం కోసం సాధ్యతకి లోబడి సంబందించి శాఖలకు ప్రతిపాదన చెయ్యడం జరిగింది.

ఈ సమావేశంలో కాకినాడ డిడి మైన్స్ ఈ. నరసింహ రెడ్డి, రాజమహేంద్రవరం ఏ డీ ఎమ్. విష్ణు వర్ధన్, ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, ఈ ఈ పొల్యూషన్ ఎన్. అశోక్ కుమార్, ఎస్ ఈ ఆర్డల్యుయస్ డి. బాలశంకర్ రావు, డి డి (గ్రౌండ్ వాటర్) వై. శ్రీనివాస్, సి ఐ (సెబ్) వి. అప్పారావు, ఎస్పీ ఆఫీస్ సిబ్బంది ఏ. దుర్గా రావు, జెపి ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *