Breaking News

ఒక్క ఆకలి చావు ఉండకూడదు అనే ఆశయంతో రాష్ట్ర ఆహార కమిషన్ పనిచేస్తోంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక్క ఆకలి చావు ఉండకూడదు అనే ఆశయంతో రాష్ట్ర ఆహార కమిషన్ పనిచేస్తోందని, అధికారులు అవినీతి పాల్పడితే ఫుడ్ కమిషన్ తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, కమిషన్ సభ్యులు జే. కృష్ణ కిరణ్ లు  తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలో ప్రభుత్వ పాఠాశాలలు, ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంటశాలను, మధ్యాహ్న భోజన పథకం అమలు, ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలను, ఇన్నీసు పేట లోని చౌక ధరల దుకాణం, మొబైల్ డెలివరీ యూనిట్ వాహనం, రాజమహేంద్రవరం ఎం ఎస్ ఎల్ పాయింట్ లను తనిఖీ చేసే దిశలో 15 చోట్ల పర్యటించడం జరిగింది.

ఈ సందర్భంగా విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఆహార భద్రత బిల్లు 2013 కి లోబడి రాష్ట్ర ఫుడ్ కమిషన్ పని చేస్తున్నదని తెలిపారు. ఎవ్వరూ భయాందోళనలకు గురి అవ్వ వలసిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కువ భాగస్వామ్యం తో నిర్వహించే ఆహార భద్రత విధానం రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయడం కోసం కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు 25 వ జిల్లాగా తూర్పు గోదావరి జిల్లా లో పర్యటన చేస్తున్నామని తెలిపారు.  ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో క్షేత్ర స్థాయి లో అమలు తీరు పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా మార్పు రావాలన్నదే మా పర్యటన ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కేంద్ర బృందం పర్యటన సమయంలో రాష్ట్రం లో అమలు చేస్తున్న తీరును పరిశీలించడం జరుగుతుంది.  జిల్లాలు పర్యటన లో భాగంగా గుర్తించిన లోతుపాతులు గమనించి వాటిపై తగిన సూచనలు చేస్తూ ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తామని తెలిపారు. వాటిపై ముఖ్యమంత్రి సూచనలు మేరకు మరింత పకడ్బందీగా రాష్ట్రం లో ఆహార భద్రత కల్పిస్తాం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మొబైల్ డెలివరీ యూనిట్స్ వాహనాలు ఏర్పాటు ఇంటింటికీ నిత్యావసర సరుకులు సరఫరా చేశారని సిహెచ్. విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల కు, మధ్యాహ్న భోజన పథకం కోసం ఆయా కేంద్రాలను నిత్యావసర సరుకుల రవాణా చెయ్యాలని కమిషన్ సూచనలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆమేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆహార కమిషన్ అటోనిమస్ బాడీ గా స్వంతత్ర ప్రతిపత్తి కలిగి ఉందన్నారు. ఆహార భద్రత పథకం అమలులో అవినీతి ని సహించమని, హెచ్చరించి, మారకపోతే కేసులు నమోదు చేయడం, అపరాధ రుసుం వేస్తామని అన్నారు. పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం పోర్టిఫైడ్ రైస్ ను కూడా కలిపి మధ్యాహ్న భోజన, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహారం లో అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ మాట్లాడుతూ, జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, పిఎంఎంవివై  (Pradhan Mantri Matru Vandana Yojana), ఇతర సంక్షేమ పథకాలు అమలు తీరును , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ల వసతి గృహల నిర్వహణ ను  క్షేత్ర స్థాయి లో పరిశీలించడం జరిగిందని అన్నారు. జిల్లాలో పిల్లలు, విద్యార్థులు, పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య  సంబంధించి పౌష్టికాహరం  అమలు జరుగుతున్న ప్రాజెక్టులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. దేశంలో ఇంటింటికీ రేషన్ సరుకులు వాహనాలు ద్వారా అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయి లో ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో అమలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

తొలుత ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు వండే వంట శాలను చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి సందర్శించి అక్కడ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీ విధానం తెలుసుకున్నారు.

ఈ పర్యటన లో డీఎస్స్వో పి. ప్రసాద రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె. విజయకుమారి, డి ఈ ఓ ఎస్. అబ్రహం, డి ఎం (సీఏ స్) పి. తనూజా తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *